అధికార పార్టీ లీడర్ ను పక్కాప్లాన్ తో లేపేశారు. జస్ట్ వచ్చి రివాల్వర్లతో ఢిష్యూమ్ ఢిష్యూమ్ !
లక్నో/ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బీజేపీ నేతను పట్టపగలు కాల్చి చంపేశారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు బీజేపీ నేతపై తుపాకులతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రాజకీయ విద్వేషాల కారణంగానే బీజేపీ నాయకుడి హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మొరాదాబాద్‌కు చెందిన స్థానిక బీజేపీ నాయకుడు అనూజ్ చౌదరి హత్యకు గురయ్యాడు. తన ఇంటి పక్కనే ఉన్న రోడ్డుపై మరో వ్యక్తితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు అతి దగ్గరగా అనూజ్ చౌదరిపై తుపాకులతో కాల్చి పారిపోయారు. వెంటనే అనూజ్ చౌదరి కిందపడిపోయాడు. అనూజ్ స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉంటాడని, మోరాదాబాద్‌లోని అతని ఇంటి ముందు ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఈఘటనా స్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ ప్రారంభించిన పోలీసు అధికారులు బీజేపీ నేత హత్య వెనుక రాజకీయ వైరం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. క్యాప్చర్ చేయబడిన సీసీటీవీ ఫుటేజీలో, కాల్పుల నుండి కింద పడిపోయిన తర్వాత కూడా దుండగులు అనూజ్‌పై కాల్పులు జరుపుతున్నట్లు రికార్డు అయ్యాయ.
34 ఏళ్ల అనుజ్ చౌదరి మొరాదాబాద్‌లోని తన ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అనూజ్‌పై కాల్పులు జరిపారు. ఈ సమయంలో కింద పడిన అతడిని పైకి లేపేందుకు అతనితో పాటు ఉన్నవారు ప్రయత్నించగా దుండగులు మరోసారి అతని మీద కాల్పులు జరిపారు. దీంతో అతనితో పాటు ఉన్న వారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు.

అనంతరం సమీపంలోకి వచ్చిన నిందితులు అనూజ్ ప్రాణాలు పోయాయా, లేదా అని నిర్ధారించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. తర్వాత, అనూజ్ చౌదరిని మొరాదాబాద్‌లోని బ్రైట్‌స్టార్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే అనూజ్ చనిపోయాడని పోలీసు అధికారులు అన్నారు. అనూజ్ చౌదరి సాంభాలోని అస్మోలీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి మొరాదాబాద్ ఎస్పీ హేమ్‌రాజ్ మీనా మాట్లాడుతూ అనుజ్ చౌదరిని బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు కాల్చి చంపారని తెలిపారు. అతని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు అమిత్ చౌదరి, అంకిత్ అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసుతో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా ? అని ఆరా తీస్తున్నామని మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications