టీ బిల్లుపై న్యాయసలహా: మారిన ప్రభుత్వ వ్యూహం

రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి న్యాయ నిపుణుల అభిప్రాయం చేరినట్లు తెలుస్తోంది. న్యాయ సలహా అందిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుంది. మొదట లోకసభలోనే ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే, లోకసభలో ఎప్పుడు ప్రవేశపెడతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రేపు (బుధవారం) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండడంతో తెలంగాణ బిల్లును ప్రతిపాదించే అవకాశం లేదు. కాన్సాలిడేటెడ్ ఫండ్‌కు సంబంధించిన ప్రస్తావన ఉండడంతో పునర్విభజన బిల్లును ద్రవ్యబిల్లుగా రాజ్యసభ భావిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ద్రవ్య బిల్లు ఏదైనా సరే దాన్ని తొలుత లోకసభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
కాగా, లోకసభ వ్యవహారాల కమిటీ ముందుకు కూడా తెలంగాణ బిల్లు మంగళవారం రాలేదు. ఓట్ ఆన్ అకౌంట్‌పై మాత్రమే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మారిన వ్యూహంలో భాగంగానే ఆరుగురు తిరుగుబాటు ఎంపీలను కాంగ్రెసు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. లోకసభలో సరైన వాతావరణం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications