లింగాయత్‌లు హిందువులే: కర్ణాటక హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
బెంగళూరు: లింగాయత్‌లు హిందుత్వంలో భాగమేనని కేంద్ర ప్రభుత్వం మంగళవారం కర్ణాటక హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి సిద్ధరామయ్య ప్రభుత్వం లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదాను ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్రం నిర్ణయం అందరూ ఊహించిందే అయినా, ఆసక్తిని కలిగించింది.

ఇప్పుడు హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదా డిమాండును పరిశీలించాలని కర్ణాటక స్టేట్ మైనార్టీ కమిషన్ ఓ ప్యానెల్‌ను నియమించింది. దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో పలువురు పిటిషన్లు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
లింగాయత్/వీరశైవ లింగాయత్‌లను హిందువులుగానే పేర్కొంటూ 2011లో జనగణన చేశారని కేంద్రం తమ అఫిడవిట్‌లో పొందుపర్చింది. అంతేకాకుండా నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ యాక్ట్ 1992 ప్రకారం ఒక కమ్యూనిటీని ఓ మతంగా ప్రకటించేందుకు ఎలాండటి నిర్దేశిత ప్రమాణాలు లేవని పేర్కొంది.
లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లు హిందుత్వంలో భాగమేనని, అది ప్రత్యేక మతం ఏమాత్రం కాదని కేంద్రం తమ అఫిడవిట్లో పేర్కొంది. లింగాయత్‌ల సామాజిక, చారిత్రక అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications