వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిపోయిన మద్యం మాఫియా: పోలీసులపై కాల్పులు, కానిస్టేబుల్ మృతి, ఎస్ఐకి తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్‌గంజ్ ప్రాంతంలో లిక్కర్ మాఫియా బీభత్సం సృషించింది. అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్న పరిశ్రమపై సోదాలకు వెళ్లిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపింది లిక్కర్ మాఫియా దుండగులు.

ఈ కాల్పుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందాడు. ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి.
మృతి చెందిన కానిస్టేబుల్‌ను దేవేంద్రగా గుర్తించారు. గాయాలపాలైన ఎస్ఐ అశోక్ కుమార్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 Liquor mafia kills constable, injures SI during raid in UPs Kasganj

అక్రమ మద్యం వ్యాపారాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులను చుట్టుముట్టిన లిక్కర్ మాఫియా ముఠా.. వారిపై కాల్పులు జరిపింది. అంతేగాక, కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడింది.

ఈ సమాచారం అందిన వెంటనే అదనపు పోలీసులు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చేపట్టాయి. సిధ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా ధిమర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన ఎస్ఐ అశోక్ కుమార్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మద్యం మాఫియా దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ దేవేంద్ర కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అంతేగాక, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు.

పోలీసులపై దాడికి పాల్పడిన మద్యం మాఫియాపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారని జిల్లా కలెక్టర్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఏడీజీ అజయ్ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

English summary
Apolice constable was killed and an SI wounded by goons in Kasganj area of Uttar Pradesh on Tuesday. The cops had gone to raid an illegal liquor factory in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X