రియల్ యాంకర్ లకు పోటీగా తొలి 'ఏఐ' న్యూస్ యాంకర్ లిసా!!
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో ఇప్పటికే మనుషులు మాన్యువల్ గా చేయాల్సిన పనులను కంప్యూటర్లు, యంత్రాల సహాయంతో శరవేగంగా చేస్తున్నారు. టెక్నాలజీ పరుగులు తీస్తున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకు తన అడ్వాన్స్మెంట్ చూపిస్తుంది. అన్ని పనులను చేసేలా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటికే చాట్ జిపిటి ద్వారా రాయడం, చదవడం వంటి అనేక పనులను సునాయాసంగా చేసేస్తుంటే ఇప్పుడు కృత్రిమ మేధ సహాయంతో యాంకర్లను కూడా టెలివిజన్ స్క్రీన్ మీద తీసుకు వస్తున్నారు. తాజాగా ఒడిశాకు చెందిన OTV కృత్రిమ మేథ (AI) సహాయంతో ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించింది. ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ లిసా ను రూపొందించింది.

యాంకర్ లిసా ఒడిస్సా సాంప్రదాయ చేనేత చీరను ధరించి చక్కని ఆహార్యంతో కంప్యూటర్లో రూపొందించబడిన మోడల్. ఇక ఆ న్యూస్ యాంకర్ సదరు టెలివిజన్లోనూ, డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనూ ఒరియా తోపాటు ఇంగ్లీషులోనూ వార్తలు చదివే విధంగా ప్రోగ్రామ్ చేయబడిన యాంకర్. చీర కట్టులో అచ్చమైన మహిళ లాగా కృత్రిమ మేధ తో తయారుచేసిన వర్చువల్ న్యూస్ యాంకర్ వార్తలను గడగడా చదివేసింది.
అసలైన న్యూస్ యాంకర్ లా లిసా వార్తలు చదివిన తీరు అందరినీ అబ్బురపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేయబడిన ఈ యాంకర్ బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లీష్ వార్తలను చదవడం పైనే దృష్టి ఉంటుంది. ఒడిశాలో కృత్రిమ మేధస్సు తో తయారుచేయబడిన లిసా యాంకర్ గా టెలివిజన్ స్క్రీన్ మీదకు రావడం ఒక ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని చెబుతున్నారు.
Meet Lisa, OTV and Odisha’s first AI news anchor set to revolutionize TV Broadcasting & Journalism#AIAnchorLisa #Lisa #Odisha #OTVNews #OTVAnchorLisa pic.twitter.com/NDm9ZAz8YW
— OTV (@otvnews) July 9, 2023
రాబోయే రోజులలో మరింత నైపుణ్యం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సైట్లలో కూడా ముందు ముందు లిసాను చూడవచ్చని ఓటీవీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే, ఖర్చు తక్కువగా ఉంటే ముందు ముందు నిజమైన యాంకర్ల స్థానంలో వర్చువల్ యాంకర్లు వచ్చి చేరడం ఖాయం.












Click it and Unblock the Notifications