Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

త్రిపురలో స్థానిక సంస్థల ఎన్నికలు- భద్రత కట్టుదిట్టం : సుప్రీం ఆదేశాల మేరకు అదనపు బలగాలు..!!

త్రిపురలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అగర్తల మున్సిపల్ కార్పోరేషన్ తో పాటుగా మరో 12 స్థానిక సంస్థలకు పోలింగ్ ప్రారంభమైంది. కొద్ది రోజులు రాష్ట్రంలో రాజకీయంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టులో వ్యాఖ్యాలు దాఖలవ్వటం..వీటికి సంబంధించి సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలకు అవకాశం లేకుండా రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.

త్రిపుర పోలీస్ ఫోర్స్.. త్రిపుర స్టేట్ రైఫిల్స్‌తో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో పాటుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలను కూడా మోహరిస్తామని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ - లా అండ్ ఆర్డర్ అరిందమ్ నాథ్ తెలిపారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు..లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా టీఎస్ఆర్ దళాలతో పాటుగా పోలీసులను మోహరించారు. 20 పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వచ్చే 644 పోలింగ్ స్టేషన్‌లను వేర్వేరుగా సున్నితమైనవి...అల్లర్లు జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు..దీనికి అనుగుణంగా భద్రతా బలగాల మోహరించారు.

Local body elections in Tripura amid heavy police deployment and security upon directions from the Supreme Court

ఎనిమిది జిల్లాల్లోని మొత్తం 20 పోలీస్ స్టేషన్లకు మొబైల్ పెట్రోలింగ్ కోసం తగిన సంఖ్యలో వాహనాలను అందించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అగర్తల కార్పోరేషన్ తో పాటుగా మరో 12 స్థానిక సంస్థల ఎన్నికల కోసం 15 సీఆర్పీఎఫ్ టీంలను రంగంలోకి దించారు. పెండింగ్ లో ఉన్న వారెంట్ల అమలు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 161 పెండింగ్ వారంట్లను అమలు చేసారు. అదే విధ:గా 433 ముందస్తు అరెస్టులు చేసారు.

ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో కేసులు నమోదు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించిన అక్టోబర్ 22వ తేదీ తరువాత ఇప్పటి వరకు 57 రాజకీయ హింసాత్మక ఘటనలు నమోదయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+