కొత్త నోటుకు నోచుకోనోళ్లు.. పొందినోళ్లు ఎంతమందో తెలుసా?
కొత్త నోటుకు నోచుకోనోళ్లు.. పొందినోళ్లు ఎంతమందో తెలుసా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశ ప్రజలంతా కరెన్సీ కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించి నేటికి 40రోజులు పూర్తి కావస్తున్నా.. ప్రజలందరికీ నగదు అందుబాటులోకి వస్తున్న పరిస్థితి లేదు.
చాలావరకు ఏటీఎంలు అవుటాఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులతోనే దర్శనమిస్తుండటం, బ్యాంకుల్లోను నగదు పూర్తిస్థాయిలో పంపిణీ కాకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బ్యాంకులు, ఏటీఎంల ద్వారా రూ.9లక్షల కోట్ల నగదు చలామణిలోకి వచ్చినా.. చాలామందికి ఇంకా కొత్త నోట్లు చేరనే లేదు.
ఈ నేపథ్యంలో లోకల్ సర్కిల్స్ అనే ఓ సంస్థ.. దేశంలో ఎంతమంది వద్ద కొత్త నోట్లు ఉన్నాయి? ఇంకా ఎంతమందికి చేరాల్సి ఉంది? నోట్ల రద్దు ప్రభావం వ్యాపార సంస్థలపై ఎలా ఉందన్న అంశాలపై సర్వే చేపట్టింది.

సర్వేలో వెల్లడైన విషయాలు:
41%
2వేల నోటు
లేనివారు
59%
2వేల నోటు
ఉన్నవారు
32%
500 నోటు
ఉన్నవారు
68%
కొత్త 500
నోటు లేనివారు
45%
2వేల నోటును
దాచుకోవాలనుకుంటున్నవారు
14%
అత్యవసరమైతేనే
ఉపయోగిస్తామంటున్నవారు
30-90%
తగ్గిన వ్యాపార స్థాయి
90%
నోట్లరద్దుతో వ్యాపారం తగ్గిందన్న వారు












Click it and Unblock the Notifications