Wife: అయ్యో మీకు పిల్లలు లేరా ?, ఎవరిది లోపం ?, శాడిస్టు సమాజంలో బతకలేమని జంగిల్ రిసార్టులో ?
పిల్లల కోసం డాక్టర్ దగ్గర చూపించుకోలేకపోయారా ?, పోనీ వేరే పెళ్లి చేసుకోకూడదా, ఎవరిది లోపం అంటూ లేనిపోని మాటలతో ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు. పెళ్లైయిన జంటతో శాడిస్టు సమాజం ఇలాంటి మాటలే మాట్లాడింది.
బెంగళూరు/మైసూరు: ఒంటరిగా ఉన్న యువతి, యువకులను మీ పెళ్లి ఎప్పుడు అని కొందరు ప్రశ్నిస్తారు. పెళ్లి అయిన వాళ్లను మీకు ఎంత మంది పిల్లలు అని ప్రశ్నిస్తారు. పిల్లలు లేరని దంపతులు ఎవరైనా చెబితే నానా రకాలుగా మాట్లాడుకుంటారు. పోని దంపతుల ముందు అయినా సైలెంట్ గా ఉంటారా అంటే అదిలేదు. అయ్యో డాక్టర్ దగ్గర చూపించుకోలేకపోయారా ?, నాటు మందు తీసుకోకూడదా, పోనీ వేరే పెళ్లి చేసుకోకూడదా అంటూ లేనిపోని ఉచిత సలహాలు ఇచ్చేస్తుంటారు. ఇక్కడ పెళ్లైయిన జంటతో శాడిస్టు సమాజం ఇలాంటి మాటలే మాట్లాడింది. దెబ్బకు భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. శాడిస్టు సమాజం సూటిపోటి మాటలతో భర్త ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హెచ్ డీ కోటే తాలుకాలోని గ్రామంలో నివాసం ఉంటున్న ధర్మరాజు అలియాస్ రాజు (28) అనే యువకుడు ఐదు సంవత్సరాల క్రితం రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న ధర్యరాజు, రూపా దంపతులు చాలా సంతోషంగా జీవించారు. వివాహం అయినప్పటి నుంచి బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు.

క్వాటర్స్ లో నివాసం
ధర్మరాజు, అతని భార్య రూపా మైసూరు జిల్లాలోని అంతరసంతే ప్రాంతంలోని ఓ జంగిల్ రిసార్ట్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే జంగిల్ రిసార్ట్ లో చాలా మంది ఫ్యామిలీలు ఉద్యోగాలు చేస్తున్నారు. జంగిల్ రిసార్ట్ లో ఉద్యోగాలు చేసే వారికి ఆ రిసార్ట్ యజమాన్యం అందరికి క్వాటర్స్ ఇచ్చింది. ధర్మరాజు, రూపా దంపతులు జంగిల్ రిసార్టు లోని క్వాటర్స్ లోనే నివాసం ఉంటున్నారు.

అయ్యో మీకు పిల్లలు లేరా ?
ధర్మరాజు దంపతులు పని చేస్తున్న జంగిల్ రిసార్టులో పని చేస్తున్న కొంత మంది మీకు పిల్లలు ఎంతమంది అని వాళ్లను అడిగారు. మాకు ఇంకా పిల్లలు లేరని ధర్మరాజు దంపతులు చెప్పారు. మీకు పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయ్యింది ?, ఇంకా ఎందుకు పిల్లలు పుట్టలేదు, లోపం నీలో ఉందా, నీ భార్యలో ఉందా అని ధర్మరాజును, నీ భర్త సక్రమంగా సంసారం చేస్తున్నాడా అంటూ ఆడవాళ్లు రూపాకు పదేపదే ఇలాంటి ప్రశ్నలు వేసి విసిగించారు.

రోజు పిల్లల టాపిక్... దంపతుల మధ్య గొడవలు
ప్రతిరోజు జంగిల్ రిసార్ట్ లోని కొన్ని ఫ్యామిలీలు, చుట్టుపక్కల గ్రామాల్లోని గ్రామస్తులు ధర్మరాజు దంపతులతో పిల్లల టాపిక్ మాట్లాడటం మొదల పెట్టారు. తమిళనాడులో నాటు మందు తింటే పిల్లలు పుడుతారని, అక్కడికి వెళ్లిరావాలని ధర్మరాజు భార్చను టార్చర్ పెట్టారు. పిల్లల విషయంలో ధర్మరాజు దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

శాడిస్టు సమాజంలో బతకలేను అని ?
పిల్లల విషయంలో ధర్మరాజుతో గొడవపడిన అతని భార్య కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోవడంతో ధర్మరాజు ఒంటరిగా క్వాటర్స్ లో ఉంటున్నాడు. తరువాత కూడా కొందరు పిల్లల కోసం ఎక్కడైనా చూపించుకోండి అంటూ ధర్మరాజుకు సూచించారు. మనుషుల పరిస్థితులను అర్థం చేసుకోకుండా నిత్యం వేధిస్తున్న ఈ శాడిస్టు సమాజంలో బతకలేను అని డెత్ నోట్ చేసిన ధర్మరాజు జంగిల్ రిసార్టులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దంపతులకు పిల్లలు లేకపోతే అదివారి సమస్య, ఏదో ఉద్దరిస్తున్నామని ఉచిత సలహాలు ఇవ్వడం వలను ఓ సంసారం నాశనం అయ్యింది.












Click it and Unblock the Notifications