వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ ఎఫెక్ట్ : దూరంగా భార్య..ఆత్మహత్య చేసుకున్న భర్త

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం సడన్ గా లాక్ డౌన్ ప్రకటించి చేసిన పని చాలా కుటుంబాలను ఇబ్బంది పెడుతుంది. ఏవో పనులతో ఊర్లకు వెళ్ళిన వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయి తిరిగి ఇంటికి రావటానికి రవాణా సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక కుటుంబాలకు కుటుంబాలే ఊహించని విధంగా కరోనా లాక్ డౌన్ తో దూరంగా ఉండటం కొన్ని కుటుంబాలలో విషాదం నింపుతుంది .

కరోనా కంట్రోల్ కాకుండానే లాక్ డౌన్ ఎత్తివేత మంచిది కాదు ..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకరోనా కంట్రోల్ కాకుండానే లాక్ డౌన్ ఎత్తివేత మంచిది కాదు ..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీసింది. కరోనా లాక్‌డౌన్‌తో తన పుట్టింటికి వెళ్ళిన భార్య దూరంగా అక్కడే ఉండిపోవడం, భర్త పని లేక ఖాళీగా ఒక్కడే ఇంటికి పరిమితం కావటం , వంట రాక , బయట హోటళ్ళు లేక నిత్యం నరకం అనుభవించటం వెరసి అది తట్టుకోలేని ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలకలం రేపింది .

 Lock down effect .. away from wife ... husband committed suicide

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మధుర జిల్లాలో రాధాకుండ్‌ గ్రామానికి చెందిన రాకేశ్‌ అనే 32 సంవత్సరాల వ్యక్తి భార్య సోనీ నెలరోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఆమె తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.ఈ క్రమంలో భార్యపై బెంగ పెట్టుకున్న రాకేశ్‌ తాజా పరిణామాలతో ఒంటరిగా ఉండటం , ఇబ్బంది పడుతుండటం వెరసి మానసికంగా ఆందోళనకు గురై ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ఆత్మహత్య చేసుకున్నారు .

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇక ఇప్పుడు భార్య భర్త మరణ వార్త తెలిసి అక్కడ నుండి రావటానికి కూడా రాకేశ్ భార్య ఇబ్బంది పడే పరిస్థితి . కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ఈ తరహా ఘటనలకు కారణముతుంది. ఈ విధమైన మరణాలు మరింత పెరిగే పరిస్థితి లాక్ డౌన్ పొడిగిస్తే కనిపించే ప్రమాదం ఉంది.

English summary
lockdown announced by the central and state governments has taken the lives of people . Uttar Pradesh has witnessed the death of a spouse who committed suicide after a corona lockdown with his married wife went her mother's house and didn't return back . he is liing single at his house and depressed without his wife so, he ommitted suicide .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X