వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికల్లో బీజేపీ షాక్: సమాజ్‌వాదీ పార్టీలో సమూల మార్పులకు తెరలేపిన అఖిలేష్ యాదవ్

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థ ఓటమిపాలు కావడంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ఎస్పీ ప్రధాన కార్యాలయం మినహా అన్ని పార్టీ పదవులను రద్దు చేశారు. ఆ పార్టీ యూపీ అధ్యక్షుడు నరేష్‌ ఉత్తమ్‌ ఆయన స్థానంలో కొనసాగనున్నారు.

లోక్‌సభ ఉపఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ.. బీజేపీకి రెండు ప్రధాన కంచుకోటలను సమర్పించుకుంది.

"సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలను రద్దు చేశారు. అయితే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని దీన్నుంచి మినహాయించారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, యువజన, మహిళలు సహా అన్ని పార్టీల జిల్లాల అధ్యక్షులను కూడా తొలగించాం అని సమాజ్‌వాదీ పార్టీ మధ్యాహ్నం ట్వీట్ చేసింది.

 Akhilesh Yadav dissolves all organisational units of Samajwadi Party after Lok Sabha bypoll loss in bastions.

ఈ చర్యకు అధికారిక కారణం చెప్పనప్పటికీ, ఉప ఎన్నికల పరాజయం నేపథ్యంలోనే పార్టీని పునరుద్ధరించే ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోందని, బీజేపీని పూర్తి శక్తితో ఎదుర్కోవడానికి సంస్థను బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించబడింది' అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వార్తా సంస్థ పీటీఐకీ వెల్లడించారు.

ఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది మరియు సీనియర్ పార్టీ నాయకులు ఆజం ఖాన్ మరియు అఖిలేష్ యాదవ్‌లకు వ్యక్తిగతంగా పెద్ద షాక్, ఇటీవలే ఖాళీ అయిన వారి లోక్‌సభ స్థానాలను ఇద్దరు బిజెపి అభ్యర్థులు చేజిక్కించుకున్నారు. రాంపూర్ మరియు అజంగఢ్ చాలా కాలంగా SP కోటలుగా పరిగణించబడుతున్నాయి మరియు మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది మొదటి ఉప ఎన్నికలు కావడంతో పార్టీ నాయకత్వానికి పెద్ద దెబ్బ.

ఇటీవల అఖిలేష్ యాదవ్‌కు కంచుకోటలైన రాంపూర్, అజాంగఢ్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగ్గా.. ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అప్రమత్తమయ్యారు. పార్టీని సరిచేయాలనే ఉద్దేశంతోనే తాజాగా, పార్టీలో సమూల మార్పులు చేస్తున్టన్నట్లు తెలుస్తోంది.

రామ్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో ఘన్‌షాయం సింగ్ లోధి.. ఎస్పీ అభ్యర్థి, అజాంఖాన్‌కు దీర్ఘకాల సహచరుడు అసిమ్ రాజాను ఓడించి విజయం సాధించగా, అజంగఢ్‌లో బీజేపీకి చెందిన దినేష్ లాల్ యాదవ్ 'నిరాహువా' విజయం సాధించారు. ఎస్పీ అజంగఢ్ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ తన ఓటమికి రాష్ట్ర పరిపాలన, "BJP-BSP కూటమి" కారణమన్నారు. 2024 సాధారణ ఎన్నికలలో జిల్లా ప్రజలు తమను మళ్లీ గెలిపిస్తారని అన్నారు.

English summary
Akhilesh Yadav dissolves all organisational units of Samajwadi Party after Lok Sabha bypoll loss in bastions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X