వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే !

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు దాదాపు ముహూర్తం ఖరారైంది.లోక్‌సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ ఈ వారంలో వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఈ నెల 7, 8 తేదీల్లో షెడ్యూల్‌ వెలువడుతుందని సమాచారం. ఒకవేళ వాయిదా పడితే 11, 12 తేదీల్లో కచ్చితంగా షెడ్యూల్‌ వెలువడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

జూన్ 3వ తేదీన 16వ లోక్‌సభ పదవీ కాలం ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది కేంద్ర ఎన్నికల కమీషన్. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతోపాటే ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Lok Sabha elections schedule will be on !

మొత్తం ఆరు లేదా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. షెడ్యూల్‌ ఈ తేదీల్లో ఎప్పుడు వచ్చినా మొదటి దశ నోటిఫికేషన్‌ ఈ నెల 18న వెలువడుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ మే 21లోగా పూర్తి చేసేందుకు వీలుగా షెడ్యూల్‌ రూపొందించినట్లు సమాచారం. కాగా జమ్మూకశ్మీర్‌లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పుడే నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఇక పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది.

ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ మేరకు యంత్రాంగం సిద్ధంగా ఉందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారో లేదో పరిశీలించారు. ఇప్పటికే ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి, ఓటర్ల జాబితా ఫైనల్ చేయడానికి అన్ని రాష్ట్రాలు కసరత్తులు ముమ్మరం చేశాయి.

ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్ యంత్రాలు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. రాష్ట్రాల వారీగా ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉండే అధికారుల బదిలీలను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో ఆ ప్రక్రియ సైతం కొనసాగుతోంది . మొత్తానికి యుద్ధ ప్రాతిపదికన సార్వత్రిక ఎన్నికల కసరత్తు నిర్వహిస్తోంది. మార్చి 7,8 తేదీలలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది అది కాకుంటే 11, 12 తేదీల్లో కచ్చితంగా షెడ్యూల్‌ వెలువడుతుందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు .

English summary
The Central Election Commission is preparing for general elections. CEC is preparing to announce an election schedule on March 7th or 8th .Political parties believe that the schedule will be scheduled on 11th and 12th if they are postponed. The Election Commission will conduct notification in this week for the Lok Sabha and the four state Assembly elections .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X