Lok Sabha: లోక్ సభ అసాధారణ నిర్ణయం..! ప్రధాని స్పీచ్ లేకుండానే..!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య పోరు నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాడీవేడీ మాటల యుద్దం కొనసాగుతోంది. ఇదే క్రమంలో లోక్ సభ (lok sabha)లో చివరిగా జరగాల్సిన ప్రధాని మోడీ ప్రసంగానికి సైతం విపక్షాలు తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నాయి. నిన్న లోక్ సభలో విపక్ష మహిళా ఎంపీలు ప్రధాని మోడీని చుట్టుముట్టి నినాదాలు చేయడంతో ఈ ప్రసంగం వాయిదా పడింది.

లోక్ సభలో అమెరికా డీల్ రచ్చ (lok sabha)

ఇవాళ మరోసారి లోక్ సభలో ప్రధాని మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించేందుకు సిద్ధం కాగా విపక్షాలు అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగాయి. పదే పదే లోక్ సభ కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. స్పీకర్ ఓం బిర్లా విపక్షాలను శాంతించాలని ఎంత కోరినా పట్టించుకోకపోవడంతో ఇక చేసేది లేక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదిస్తూ అసాధారణ రీతిలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు.

Lok Sabha Passes Motion of Thanks Bypassing Customary PM s Address

ప్రధాని స్పీచ్ లేకుండానే ఆమోదం

ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు. నిన్న సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం చేయనివ్వకుండా అడ్డుకోవడంపై విపక్షాలు తీవ్ర నిరసనకు దిగాయి. మాజీ ఆర్మీ ఛీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంలో వివాదాస్పద అంశాల్ని రాహుల్ గాంధీ ప్రస్తావించేందుకు ప్రయత్నించగా స్పీకర్లు, బీజేపీ సభ్యులతో సహా అడ్డుకున్నారు. దీంతో ప్రధాని ప్రసంగం కూడా చేయకుండా విపక్షం అడ్డుపడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సంప్రదాయ ప్రధాని ప్రసంగం లేకుండానే ఆమోదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+