Lok Sabha: చుట్టుముట్టేశారు-రావొద్దు..! ప్రధానికి స్పీకర్ షాకింగ్ సలహా..!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య తీవ్ర వాగ్యుద్దాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎప్ స్టీన్ ఫైల్స్, మాజీ ఆర్మీ ఛీఫ్ నరవణే రాసిన పుస్తకంలో అంశాలతో అధికార ఎన్డీయేను టార్గెట్ చేసేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి ప్రసంగంపై లోక్ సభలో (lok sabha) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. చివరిగా ప్రధాని మోడీ సభలో ప్రసంగించాల్సి ఉంది. అప్పుడే ట్విస్ట్ ఎదురైంది.
ప్రధాని మోడీ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం చేయాల్సి ఉండగా.. కొన్ని నిమిషాల ముందే అనూహ్యంగా కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆయన కూర్చొన్న సీటును చుట్టుముట్టారు. అదే సమయంలో స్పీకర్ ఓం బిర్లా సభలో పరిస్ధితిని ప్రధాని మోడీకి తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపీలు ఆయన సీటును చుట్టుముట్టేశారని, సభకు రావొద్దని ప్రధానికి సలహా ఇచ్చారు. దీంతో మోడీ సభకు రాకుండానే ఉండిపోయారు.

చారిత్రాత్మకంగా, రాజకీయ విభేదాలు పార్లమెంటులోకి తీసుకురాకూడదని స్పీకర్ ఓం బిర్లా ఇవాళ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది సభ్యులు ప్రధానమంత్రి సీటు వద్దకు వెళ్లి ఊహించని సంఘటనకు కారణమై ఉండవచ్చని తనకు విశ్వసనీయ సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. అందుకే ప్రదాని మోడీకి సభకు రావొద్దన తాను సూచించించినట్లు తెలిపారు. ఆయన వచ్చి ఉంటే అలాంటి సంఘటన దేశ గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసేది. అందుకే పార్లమెంటుకు రావద్దని తాను ప్రధానమంత్రిని కోరినట్లు తెలిపారు. దీంతో ప్రధాని ప్రసంగం ఇవాళ్టికి వాయిదా పడింది. చివరికి ఇవాళ కూడా ప్రసంగం సాగలేదు.












Click it and Unblock the Notifications