అధికారులకు సిద్దూ ప్రభుత్వం షాక్, రూ. కోట్ల ఆస్తులు సీజ్, మాజీ సీఎం అల్లుడికి బంపర్ ఆఫర్ !
బెంగళూరులోని బెస్కాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు చెందిన అక్రమాస్తులు గుర్తించిన కర్ణాటక లోకాయుక్త అధికారులు మంగళవారం ఉదయం దాడులు నిర్వహించారు. బెస్కాం ఇంజనీర్ ఇంటిలో వజ్రాలు, బంగారం, పురాతన వస్తువులతో సహా రూ.1.50 కోట్ల విలువైన వస్తువులు రూ. 92. 95 లక్షల నగదును లోకాయుక్త అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
లోకాయుక్త పోలీస్ డిపార్ట్‌మెంట్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం ఏకకాలంలో 13 మంది ప్రభుత్వ అధికారులకు షాక్ ఇచ్చింది. మంగళవారం ఉదయం కర్ణాటకలోని వివిద జిల్లాల్లో ఏకకాలంలో 200 మంది లోకాయుక్త అధికారులు అవినీతి అధికారులు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఇందులో ముగ్గురు అధికారులు బెంగళూరులో ఉన్నారు, ఏకకాలంలో అనేక బృందాలు అవినీతి అధికారుల ఇళ్లపై దాడి చేశారు.

అక్రమ సంపాదన కేసులకు సంబంధించి ఈ దాడి జరుగుతోందని లోకాయుక్త వర్గాలు తెలిపాయి. బెంగళూరు సిటీలోని జక్కూరులోని బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ (బెస్కాం) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హెచ్‌డి చెన్నకేశవ ఇంట్లో 6 లక్షల రూపాయల నగదు, సుమారు 3 కిలోల బంగారం, 28 కిలోల వెండి, 25 లక్షల విలువైన వజ్రాలు, 25 లక్షల విలువైన పురాతన వస్తువులు లభించాయి.
చెన్నకేశవ ఇంట్లో చిక్కిన అక్రమాస్తుల విలువ మొత్తం రూ. 1.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని సహకారనగర్ లోని చెన్నకేశవన్ బావమరిది తరుణ్ ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించగా రూ. 500 విలువైన రూ. 92,95, 460 నగదు, 55 గ్రాముల బంగారం లభించింది. చెన్నకేశవతో పాటు బెంగళూరులోని బెస్కాంలో ఈఈగా ఉద్యోగం చేస్తున్న సుధాకర్ రెడ్డికి చెందిన అక్రమాస్తులు గుర్తించారు.
హెచ్ఎస్ కృష్ణమూర్తి, కన్మినికే మిల్క్ ప్రొడ్యూసర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ, కుంబల్‌గోడుకు చెందిన అధికారుల ఇళ్లలో కూడా లోకాయక్త అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరులోని పలు ప్రాంతాల్లో లోకాయుక్త అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని బీదర్, యాదగిరి, కోలార్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని మరో 10 మంది ప్రభుత్వ అధికారుల ఆస్తులపై కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

అయితే ఇక్కడ సిద్దరామయ్య ప్రభుత్వం బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు షాక్ ఇచ్చింది. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర ఇటీవలే కర్ణాటక బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు అయిన విషయం తెలిసిందే. బీవై విజయేంద్ర సతీమణి సోదరుడు డాక్టర్ ప్రభులింగ మాన్కర్ (విజయేంద్ర బావ)కు చెందిన ఇంటిలో, కార్యాలయంలో లోకాయుక్త అధికారులు సోదాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయంద్ర బావ మందిరి డాక్టర్ ప్రభులింగ ఇంట్లో లోకాయుక్త సోదాలు చెయ్యడంతో బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యడియూరప్ప కుటుంబం మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సొంతపార్టీకి చెందిన మాజీ సీఎం మీద బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంతో బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications