ఎలక్షన్ టైమ్ లో ఏందిరా సామి ఈరామాయణం, లంచాల డబ్బుతో గుట్కా కంపెనీలో ఎమ్మెల్యే ?

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తలనొప్పి ఎదురైయ్యింది. బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్పకు లోకాయుక్త ఉచ్చు బిగిసుకుంటున్నది. ఎన్నికల టైమ్ లో భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఎమ్మెల్యే కొడుకు, విద్యుత్ శాఖలో సీనియర్ అధికారి అయిన ప్రశాంత్ మాడాళ్ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు.

తరువాత ఎమ్మెల్యే విరుపాక్షప్ప హైకోర్టులో బెయిల్ తీసుకున్నాడు. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చెయ్యడంతో బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్పను సోమవారం రాత్రి లోకాయుక్త అధికారులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్పను కోర్టు ముందు హాజరుపరిచిన లోకాయుక్త అధికారులు ఆయన్ను విచారణ చెయ్యడానికి కస్టడీకి తీసుకున్నారు.

ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్ప మీద ఓ కేసు, ఆయన కుమారుడు ప్రశాంత్ మాడాళ్ తో పాటు ఇతరుల మీద రెండు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప, ఆయన కుటుంబ సభ్యుల మీద మరో కేసు నమోదు చెయ్యడానికి అధికారులు ఆలోచిస్తున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Lokayukta Police ready to register another case against Karnataka BJP MLA Madal Virupakshappa.

మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు అయిన మడాళ్ విరుపాక్షప్ప కేఎస్ డీఎల్ అధ్యక్షుడిగా పదవి దక్కించుకున్నారు. కేఎస్ డీఎల్ టెండర్లు ఇవ్వడానికి మాడాళ్ విరుపాక్షప్ప కుమారుడు, కర్ణాటక విద్యుత్ శాఖలో సినియర్ అధికారిగా పని చేస్తున్న ప్రశాంత్ మడాళ్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు.

కేఎస్ డీఎల్ టెండర్లు ఇవ్వడానికి భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్ప కుటుంబ సభ్యులు లంచం డబ్బులు వైట్ మనీగా చెయ్యడానికి వక్కల మండీలు, గుట్కా కంపెనీలో, క్రషర్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అధికారులు అంటున్నారు. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప కేఎస్ డీఎల్ అధ్యక్షుడు అయిన తరువాత దావణగెరె, శివమొగ్గ, బెంగళూరులో భారీ మొత్తంలో స్థిరాస్తులు కొనుగోలు చేశారని, వాటి వివరాలు సేకరిస్తున్నామని లోకాయుక్త అధికారులు అంటున్నారు.

ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్ప మీద మరో కేసు నమోదు చెయ్యడానికి లోకాయుక్త అధికారులు సిద్దం అయ్యారని తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న సమయంలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే మాడాళ్ విరుపాక్షప్ప ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైనారని సొంత పార్టీ నాయకులే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+