loksabha election 2024: లోక్ సభ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్ విడుదల-మొదలైన నామినేషన్లు..!
లోక్ సభ ఎన్నికల తొలి దశ పోరు నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. 21 రాష్ట్రాల్లోని 102 లోక్ సభ నియోజకవర్గాలకు జరిగే తొలిదశ పోలింగ్ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీంతో ఆయా సీట్లలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. లోక్ సభ తొలి దశ ఎన్నికల నామినేషన్లను ఈ నెల 27 వరకూ స్వీకరిస్తారు. అనంతరం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఆ తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్ధుల జాబితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ ఉంటుంది.

లోక్ సభ తొలి దశ పోలింగ్ కు నామినేషన్లను ఈ నెల 27 వరకూ స్వీకరించిన తర్వాత 28న పరిశీలన చేస్తారు. ఈ నెల 30 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. లోక్ సభ తొలి దశ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో తమిళనాడులో 39 సీట్లు, రాజస్తాన్ లో 12 సీట్లు, ఉత్తర్ ప్రదేశ్ లో 8 సీట్లు, మధ్యప్రదేశ్ లో 6 సీట్లు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో ఐదేసి సీట్లు, బీహార్లో 4 సీట్లు, బెంగాల్ లో 3 సీట్లు, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలో రెండేసి సీట్లు, ఛత్తీస్ ఘడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో సీటు ఉన్నాయి.
ఏప్రిల్ 19న జరిగే తొలి దశ పోలింగ్ తో మొదలై జూన్ 1న ఏడో దశ పోలింగ్ తో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
అన్ని దశల పోలింగ్ ఓట్లను జూన్ 4న లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. మరోవైపు ఏపీలో ఎన్నికలను నాలుగోదశలో మే 13న నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ 20న దీని కోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల ప్రక్రియతో మొదలు పెట్టి మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ తో ఈ ప్రక్రియ ముగియనుంది.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications