Loksabha election 2024 schedule: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ పై మరో అప్ డేట్..!

దేశంలో ఈ ఏడాది లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల కోసం జాతీయ స్ధాయిలో తీసుకోవాల్సిన చర్యలతో పాటు పెండింగ్ లో ఉన్న ఏపీ,ఒడిశా, గోవా వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం తగు ఆదేశాలు జారీ చేస్తోంది.

ఈ ప్రక్రియ ఇప్పటికే చివరి దశకు చేరుకోవడంతో కీలకమైన షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం చేస్తోంది. తాజా అంచనాల ప్రకారం మార్చి 9 తర్వాత ఏక్షణాన అయినా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ సిద్దమవుతోంది.

loksabha election 2024 schedule to be released after march 9 only: latest reports

గతంలో 2019 సార్వత్రిక ఎన్నికలకు మార్చి 10న ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈసారి కూడా దాదాపుగా ఒకట్రెండు రోజుల అటు ఇటుగా షెడ్యూల్ ప్రకటనకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్దమవుతోంది. దీంతో ఈ ఎన్నికల తేదీలు స్ధానికంగా పండుగలు, పరీక్షలు ఇలా ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకుంటోంది.

లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించగానే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వాలు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదు. కేవలం ఈసీ అనుమతితోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ అధికారులతో, ఇటు రాజకీయ పార్టీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. లేకపోతే షెడ్యూల్ ప్రకటన తర్వాత తిరిగి మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్ధితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ మార్చి రెండోవారంలోనే లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుందని జాతీయ మీడియా అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+