ఫ్రీగా ఘుమ ఘుమలాడే దోసె, ఘీ లడ్డు, జ్యూస్- అదొక్కటే కండిషన్: హోటల్ ముందు క్యూ కట్టారు

Lok Sabha election 2024 phase 2: రెండో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోసం ముమ్మరంగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లో మొత్తం 88 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.

ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మలి విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లల్లో ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది.

Long queues at Nisarga Grand Hotel in Bengaluru offering free tiffin to voters who display their inked fingers

పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటకలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన భార్య సుధా మూర్తి, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. తొలి గంటలోనే ఓటు వేశారు.

కేరళలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తిరువనంతపురంలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు, త్రిశూర్ బీజేపీ అభ్యర్థి సురేష్ గోపీ, రాజస్థాన్‌లో స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Long queues at Nisarga Grand Hotel in Bengaluru offering free tiffin to voters who display their inked fingers

ఉదయం 9 గంటల వరకు కర్ణాటకలో 9.21 శాతం మేర పోలింగ్ నమోదైంది. అత్యధికంగా దక్షిణ కన్నడ జిల్లాలో 14.33 శాతం పోలింగ్ నమోదైంది. ఉడుపి చిక్‌మగళూరు- 12.82, మైసూరు కొడగు-11.01, చామరాజనగర, మండ్య- 7.7, చిత్రదుర్గ- 7.73, బెంగళూరు సెంట్రల్- 8.14 శాతం మేర పోలింగ్ రికార్డయింది.


కాగా- పోలింగ్ శాతాన్ని పెంచడానికి బెంగళూరుకు చెందిన నిసర్గ గ్రాండ్ హోటల్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఓటు వేసినట్లుగా తమ వేలిపై ఇంకు గుర్తును చూపించిన ఓటర్లకు ఉచితంగా వెన్న దోసె, నేతితో చేసిన లడ్డు, జ్యూస్‌ను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. దీనితో బెంగళూరు నృపతుంగ రోడ్డులో గల ఈ హోటల్ ముందు ఓటర్లు బారులు తీరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+