బీహార్‌లో ఏటీఎం లూటీ.. గార్డును హత్య చేసి డబ్బుతో పరార్..
ఏటీఎం వద్ద విధులు నిర్వర్తిస్తున్న గార్డును హత్య చేసి ఓ దుండగుడు డబ్బుతో పరారయ్యాడు.
పాట్నా: దేశంలో కరెన్సీ కష్టాలు వెంటాడుతున్న తరుణంలో.. బీహార్ లో ఓ ఏటీఎం లూటీ జరగడం కలకలం రేపుతోంది. పాట్నాలోని మౌర్యలోక్ కాంప్లెక్స్ లోకి చొరబడ్డ ఓ గుర్తు తెలియని దుండగుడు.. సెంట్రల్ బ్యాంకు ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బుతో ఉడాయించాడు.
ఈ క్రమంలో ఏటీఎం వద్ద విధులు నిర్వర్తిస్తున్న గార్డు దుండగుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. గార్డును హతమార్చి డబ్బుతో పరారయ్యాడు. విషయం తెలిసిన స్థానికులు గార్డు హత్యపై తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. ఇందుకు నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.

ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసుల వేట కొనసాగుతుండగా.. ఏటీఎం నుంచి ఎంత మొత్తంలో డబ్బు లూటీ అయ్యిందనేది ఇంకా తెలియరాలేదు.












Click it and Unblock the Notifications