వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ వ్యాక్సిన్లతో బోలెడు సైడ్ ఎఫెక్ట్స్; షాకింగ్ విషయాలు వెల్లడించిన కేంద్రం!!

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం, కరోనా మహమ్మారి నుండి మానవాళిని కాపాడడం కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ లను యుద్ధ ప్రాతిపదికన తయారుచేసి శరవేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా కొంతమేర మరణాలను ఆపడంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కొంతమేర సక్సెస్ అయ్యాయని చెప్పాలి. కానీ కరోనా నియంత్రణ కోసం తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ లతో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కేంద్రం తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించింది.

కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం షాకింగ్ విషయాలు వెల్లడి

కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం షాకింగ్ విషయాలు వెల్లడి

కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలియజేయాలని పూనే కు చెందిన ఒక వ్యాపారవేత్త దాఖలు చేసిన పిటిషన్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన జవాబులో అనేక కీలక విషయాలను వెల్లడించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాఖలు చేసిన ఈ పిటిషన్ కు బదిలిస్తూ కేంద్రం ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశ ప్రజలను షాక్ కు గురిచేస్తుంది. ఇంతకు కేంద్రం ఏం చెప్పిందంటే దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న కోవిషీల్డ్, కోవోవ్యాక్స్, కో వ్యాక్సిన్, ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని పేర్కొంది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ఎఫెక్ట్స్ ఇవే

కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ఎఫెక్ట్స్ ఇవే

కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పిగా ఉంటుందని, శరీరంపై అక్కడక్కడ ఎర్రటి మరకలు పడతాయని, అకారణంగా వాంతులు కావడం, తీవ్రమైన కడుపునొప్పి రావడం, తలనొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అవయవాల నొప్పి, చాతి నొప్పి, కళ్ళ నొప్పులు, కళ్లు మసకగా కనిపించడం, బలహీనంగా అనిపించడం వంటి అనేక లక్షణాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

కోవ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

కోవ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

ఇక కోవ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఇంజక్షన్ చేసిన చోట వాపు లేదా నొప్పి రావడం ఇబ్బంది కలిగిస్తుందని చెబుతున్నారు అంతేకాదు తలనొప్పి, అలసట, జ్వరం, ఒళ్ళు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, వణుకు, చెమటలు పట్టడం, తల తిరగడం, దగ్గు, జలుబు వంటి తేలకపాటి లక్షణాలు కోవ్యాక్సిన్ తీసుకున్న వారిలో కనిపిస్తుందని చెబుతున్నారు.

కోవోవ్యాక్స్ సైడ్ ఎఫెక్ట్స్ డేటా ఇచ్చిన ఐసీఎంఆర్

కోవోవ్యాక్స్ సైడ్ ఎఫెక్ట్స్ డేటా ఇచ్చిన ఐసీఎంఆర్


ఇక కోవోవ్యాక్స్ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే నొప్పిగా అనిపించడం, శరీరం సున్నితంగా మారడం, అలసట, జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, చలి జ్వరం, వ్యాక్సిన్ తీసుకున్న చోట దురద, దద్దుర్లు రావడం, చర్మం ఎర్రగా మారడం, వెన్నునొప్పి, మత్తుగా ఉండడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సమాధానం ఇచ్చాయి.

స్పుత్నిక్ వీ తో వచ్చే దుష్ప్రభావాలు ఇవే..

స్పుత్నిక్ వీ తో వచ్చే దుష్ప్రభావాలు ఇవే..


ఇక స్పుత్నిక్ వి విషయానికి వస్తే స్పుత్నిక్ వి సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా ఇంజక్షన్ చేసిన చోట నొప్పి లేదా వాపు రావడం, వికారంగా అనిపించడం, అజీర్తి సమస్య, ఆకలి లేకపోవడం, చలి జ్వరం, ఆర్ర్ద్రాల్జియా, మయాల్జియ, అస్తేనియా వంటి ఇబ్బందులు వస్తాయని వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వ్యాక్సిన్ ల సైడ్ ఎఫెక్ట్స్ పై ఇచ్చిన సమాధానంతో సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించిన వ్యక్తి కేంద్రం ఇచ్చిన సైడ్ ఎఫెక్స్ పై ఆందోళన వ్యక్తం చేశారు.

సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పకుండానే వ్యాక్సినేషన్ ఇచ్చారన్న పిటీషనర్

సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పకుండానే వ్యాక్సినేషన్ ఇచ్చారన్న పిటీషనర్


వ్యాక్సినేషన్ పూర్తిగా పౌరుల స్వచ్ఛందానికే వదిలేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే విమానాలలో అనుమతించమని, హోటల్లు, రెస్టారెంట్లు, మాల్స్ లోకి అనుమతించబోమని ప్రభుత్వం చెప్పడంతో సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోకుండానే చాలామంది వ్యాక్సినేషన్ తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంతోమంది వ్యాక్సినేషన్ కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లో వైసీపీ ఎమ్మెల్యే హంగామా.. పూనకాలు లోడింగ్!!చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లో వైసీపీ ఎమ్మెల్యే హంగామా.. పూనకాలు లోడింగ్!!

English summary
The center has revealed shocking things that covid vaccines Covishield, Covo Vax, Covaccine, Sputnik V have many side effects revealed Indian Council of Medical Research and Central Drugs Standard Control Organisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X