బలవంతంగా ఆఫీసుకు పంపితే అతను ఏం చేశాడంటే
ప్రేమ విఫలమై ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకొన్న ఘటన చెన్నైలో చోటుచేసుకొంది. రెండు రోజులుగా విధులకు దూరంగా ఉంటున్న కొడుకు తల్లిదండ్రులు బలవంతంగా ఆపీసుకు పంపారు.
చెన్నై :వరుసగా రెండురోజుల పాటు విధులకు వెళ్ళలేదు. మూడో రోజు కూడ ఆఫీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు. కాని, తల్లిదండ్రులు తమ కుమారుణ్ని బలవంతంగా ఆపీసుకు పంపారు. ఆపీసులోనే ఏడవ అంతస్థు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ యువకుడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేైసుకొంది.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో రెడ్ హిల్స్ కు చెందిన రామదురై అన్నాపాలైలో ఏడంతస్థుల భనవ పై నుండి దూకి శనివారం నాడు రాత్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. ప్రైవేట్ కంపెనీలో రామదురై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.

రెండు రోజులుగా రామదురై విధులకు హజరుకావడం లేదు. మూడో రోజు కూడ విధులకు వెళ్ళకుండా ఉన్న అతణ్ణి తల్లిదండ్రులు బలవంతంగా ఆఫీసుకు పంపారు. అయితే ఆఫీసులో కూడ అతను ముభావంగానే గడిపాడు. రాత్రి సమంయలో ఆఫీసు పైకి వెళ్ళి ఏడంతస్థుల మేడపై నుండి దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు.
ప్రేమ వ్యవహారం వల్లే రామదురై మరణించాడని పోలీసులు నిర్థారించారు. రామదురై ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఆమె ఈ ప్రేమను అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురైన రామదురై ఆత్మహత్యచేసుకొన్నాడని పోలీసులు నిర్థారించారు.












Click it and Unblock the Notifications