lovers: లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్లు బాగానే ఉన్నారు మధ్యలో వెళ్లాడని కొట్టి చంపేసిన ప్రియురాలి ?

లవర్స్ లేచిపోవడంతో వారి కుటుంబ సభ్యులు గొడవలుపడ్డారు. ఇద్దరికి సర్దిచెప్పడానికి వెళ్లిన యువకుడు హత్యకు గురి కావడంతో ఆ ఊరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బెంగళూరు/ చిత్రదుర్గ: ప్రేమికులు లేచిపోయి పెళ్లి చేసుకుని వేరే ప్రాంతంలో హ్యాపీగా ఉన్నారు. అయితే అమ్మాయి, అబ్బాయిల కుటుంబ సభ్యులు గొడవలుపడ్డారు. ఆ సమయంలో ఇరు వర్గాలకు సర్దిచెప్పడానికి వెళ్లిన స్థానికంగా నివాసం ఉండే యువకుడు హత్యకు గురి కావడంతో ఆ ఊరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియురాలి ఫ్యామిలీ, ప్రియుడి ఫ్యామిలీలు, ఇప్పుడు హత్యకు గురైన యువకుడి ఫ్యామిలీ సభ్యులు ఎప్పుడు ఏం చేస్తారో అని స్థానికులు హడలిపోతున్నారు.

ప్రేమికులు ఎస్కేప్

ప్రేమికులు ఎస్కేప్

యువతి, యువకుడు ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు చేసుకుంటే అబ్బాయి, అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ విషయం తట్టుకోలేక గొడవలుపడటం సహజమే. వీరి గొడవ సద్దుమణిగేందుకు పెద్దలు, పోలీసులు రాజీలు చేసిన విషయం మనం చూస్తున్నాము. ప్రేమ వివాహాల విషయంలో ఇరు వైపుల కుటుంబ సభ్యులు హత్యలు, ప్రతీకార హత్యలు చేసుకుంటారు. అయితే ఇక్కడ ప్రేమికులు ఫ్యామిలీలు బాగానే ఉన్నా మధ్యలో వెళ్లిన యువకుడు హత్యకు గురైనాడు.

మధ్యవర్తిగా వెళ్లితే కొట్టి చంపేశారు

మధ్యవర్తిగా వెళ్లితే కొట్టి చంపేశారు

కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లాలోని గొల్లరహట్టి గ్రామంలోనే నివాసం ఉంటున్న ఇద్దరు ప్రేమికులు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ప్రేమికులు లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో లవర్ బాయ్ సిద్దేష్, అమ్మాయి తండ్రి తిప్పయ్య కుటుంబాల వీధిలోకి వచ్చి గొడవపడ్డారు. ఆ సమయంలో గొడవను విరమింపజేసేందుకు మధ్యలోకి వెళ్లిన అదే గ్రామానికి చెందిన బొమ్మలింగప్ప అలియాస్ లింగ(30) అనే యువకుడిని తిప్పయ్య, అతని ఫ్యామిలీ, బంధువులు దాడి చేశారు.

ఎవరో చేసిన తప్పుకు పక్కింటోడు ?

ఎవరో చేసిన తప్పుకు పక్కింటోడు ?

అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చెయ్యడంతో లింగా ఛాతి, తలపై తీవ్రగాయాలై అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లింగా హత్యతో అతని భార్య, ఒక సంవత్సరం వయసు పాప అనాథలు అయ్యారు. లింగా హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అతని బావ పాపన్న పోలీసు కేసు పెట్టారు. అమ్మాయి, అబ్బాయి ఫ్యామిలీలు తెలుసుకాబట్టి వారికి నచ్చ చెప్పడానికి లింగా ప్రయత్నించాడని, మధ్యలో నీ పెత్తనం ఏమిటని అతన్ని కొట్టి చంపేశారని పాపన్న ఆరోపించారు.

జిల్లా ఎస్పీ ఎంట్రీ

జిల్లా ఎస్పీ ఎంట్రీ

లవ్ మ్యారేజ్ గొడవలు ఆపడటానికి వెళ్లిన లింగా ప్రియుడి కుటుంబ సభ్యుల పక్షాన నిలబడి మాట్లాడాడని భావించిన అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు అతన్ని కొట్టి చంపేశారని పోలీసులు అంటున్నారు. చిత్రదుర్గా రూరల్ పోలీస్ స్టేషన్‌లో లింగాను హత్య చేశారని కేసు నమోదైంది. దీంతో చిత్రదుర్గ ఎస్పీ పరశురాం సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.

బయటకు రావాలంటే భయం

బయటకు రావాలంటే భయం

లింగాను కొట్టి చంపేసిన నిందితుల కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ పరుశురామ్ అన్నారు. ఇరుగుపొరుగున ఉన్న వారు గొడవపడుతుంటే అడ్డుకోవడానికి వెళ్లిన లింా హత్యకు గురి కావడంతో ఆ గ్రామంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ప్రియుడి ఫ్యామిలి, ప్రియురాలి ఫ్యామిలి, ఇప్పుడు లింగా ఫ్యామిలీతో పాటు వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు ఎలాంటి గొడవలు చేస్తారో అని గ్రామస్తులు హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+