Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: లవ్ మ్యారేజ్, భర్త బయటకు వెళ్లిన తరువాత ఏం జరిగింది, ఇంట్లో శవమైన భార్యతో ?, మ్యాటర్ !

చెన్నై/ సేలం: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. యువతి, యువకుడు వివాహం చేసుకోవడం వారి కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. చాలాకాలం పాటు కుటుంబ సభ్యుల అనుమతితో పెళ్లి చేసుకోవాలని యువతి, యువకుడు చాలాకాలం పాటు వేచి చూశారు. అయితే ప్రేమికుల కుటుంబ సభ్యులు మాత్రం వారి వెళ్లికి ససేమిరా అన్నారు. ఇదే విషయంలో విసిగిపోయిన ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దంపతులకు ఓ పాప ఉంది. భర్త బయటకు వెళ్లి తరువాత ఇంటికి వెళ్లి చూడగా అతని భార్య శవమై కనిపించడం కలకలం రేపింది.

కొన్ని ఏళ్ల నుంచి లవర్స్

కొన్ని ఏళ్ల నుంచి లవర్స్

తమిళనాడులోని సేలంలో నివాసం ఉంటున్న పొన్నుసామి కుమారుడు అరుణ్ కు కంజియూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సుబ్రమణి కుమార్తె కౌసల్యాకు కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత అరుణ్, కౌసల్యా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న కౌసల్యా, అరుణ్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

నో చెప్పిన పెద్దలు

నో చెప్పిన పెద్దలు

అరుణ్, కౌసల్యా వివాహం చేసుకోవడం వారి కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. చాలాకాలం పాటు కుటుంబ సభ్యుల అనుమతితో పెళ్లి చేసుకోవాలని కౌసల్యా చాలాకాలం పాటు వేచి చూసింది. అయితే ప్రేమికుల కుటుంబ సభ్యులు మాత్రం అరుణ్, కౌసల్యాల పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు, మూడు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి పారిపోయిన కౌసల్యా ఆమె ప్రియుడు అరుణ్ ను పెళ్లి చేసుకుంది.

కూతురు పుట్టిందని ఆనందం

కూతురు పుట్టిందని ఆనందం

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అరుణ్, కౌసల్యా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. అరుణ్, కౌసల్యా దంపతులకు 6 నెలల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో గత 3 ఏళ్లుగా తల్లి దండ్రుల నుంచి విడిపోయి ప్రేమ వివాహం చేసుకున్న కౌసల్యా తనకు బిడ్డ పుట్టినా తన తల్లిదండ్రులు చూసేందుకు ఒక్కసారి కూడా రాకపోవడంతో మనస్తాపానికి గురైయ్యిందని తెలిసింది. పాప పుట్టిన తరువాత భర్త అరుణ్ కుటుంబ సభ్యులు మాత్రం కౌసల్యాతో కలిసిపోయారు.

నేను ఏమి తప్పు చేశాను ?

నేను ఏమి తప్పు చేశాను ?

తన తల్లిదండ్రులు తనను చూడటానికి ఇంటికి రాలేదని కౌసల్యా డిప్రెషన్‌కు గురైయ్యిందని తెలిసింది. మీ తల్లిదండ్రులు కచ్చితంగా నీ కోసం వస్తారని, నువ్వు అంత ఆవేశం కపడకూడదని, మనకు చిన్నపాప ఉందని కొన్ని నెలల నుంచి అరుణ్ అతని భార్య కౌసల్యాకు నచ్చచెబుతూ వచ్చాడు. అయితే కౌసల్యా మాత్రం ఆమె తల్లిదండ్రులను తలచుకుంటూ ఆవేదన చెందింది.

ఆత్మహత్య చేసుకున్న మహిళ

ఆత్మహత్య చేసుకున్న మహిళ

అరుణ్ ఉదయం ఇంటి నుంచి బయలుదేరి పనికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న కౌసల్యా ఇంటిలో ఆమె చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం ఊయలలో పడుకున్న పాప ఏడుపు విని ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి కౌసల్యా ఉరివేసుకుని చనిపోయిందని వెలుగు చూసింది. దీంతో వెంటనే స్థానికులు కౌసల్యా భర్త అరుణ్‌కు సమాచారం అందించారు.

ఏం జరిగింది ?

ఏం జరిగింది ?

అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫూలంపాటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కౌసల్యా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎడప్పాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అరుణ్ ఫిర్యాదు మేరకు కౌసల్యా మృతిపై విచారణ జరుపుతున్నారు. పెళ్లయి మూడేళ్లయినా తల్లి. తండ్రి చూసేందుకు రాలేదనే మనస్తాపంతో కౌసల్యా ఆత్మహత్యకు పాల్పడిందని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+