చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Love marriage: లాక్ డౌన్ ముందు మతాంతర వివాహం, డాబా పక్కన భార్య మీద పెట్రోల్ పోసి !

|
Google Oneindia TeluguNews

లక్నో/చెన్నై: మతాలు వేరు అయినా యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియుడిని గుడ్డిగా నమ్మిన యువతి ఆమె పెద్దలను ఎదిరించి లాక్ డౌన్ కు ముందు మూడు నెలల క్రితం మతాతంతర వివాహం చేసుకుంది. నవదంపతులు హైవే రోడ్డు పక్కన ఉన్న డాబా దగ్గరకు వెళ్లారు. రాత్రి అక్కడే ఇద్దరూ ఉన్నారు. నవదంపతుల మద్య ఏమి జరిగిందో ? ఏమో కాని బతికున్న భార్య మీద పెట్రోల్ పోసిన భర్త ఆమెకు నిప్పంటించి పరారైనాడు. మంటల్లో కాలిపోయిన బాధితురాలు హైవే పక్కనే కుప్పకూలిపోయినా అటు వైపు వెలుతున్న వారు సినిమా చూశారే తప్పా ఆమెను రక్షించడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం కలకలం రేపింది.

Illegal affair: భార్య కాళ్లు పట్టుకోవడానికి వెళ్లిన భర్త, కసక్ అని పొడిచేసిన ప్రియుడు. క్లైమాక్స్ !Illegal affair: భార్య కాళ్లు పట్టుకోవడానికి వెళ్లిన భర్త, కసక్ అని పొడిచేసిన ప్రియుడు. క్లైమాక్స్ !

హైవే పక్కన కలకలం

హైవే పక్కన కలకలం

ఉత్తరప్రదేశ్ లోని జలాల్ జిల్లాలోని ఓరై ప్రాంతంలోని హైవే రోడ్డు పక్కన 23 సంవత్సరాల యువతి మంటల్లో కాలిపోయి రోడ్డు పక్కనపడిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రెండు మూడు గంటలు ఏమాత్రం పట్టించుకోకుండా సినిమా చూశారు. తరువాత అటువైపు వెలుతున్న వారు విషయం గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం కలకలం రేపింది.

నా మొగుడే నిప్పంటించాడు

నా మొగుడే నిప్పంటించాడు

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్లో కాలిపోయిన యువతిని జాన్సి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి దాదాపుగా కలిపోయింది. మంటల్లో కాలిపోయింది పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెసా గ్రామానికి చెందిన ఉమా (23) అనే యువతి అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తన భర్త ఆరీఫ్ తనకు నిప్పంటించాని ఉమా చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

మూడు నెలల క్రితం మతాంతర వివాహం

మూడు నెలల క్రితం మతాంతర వివాహం

సెసా గ్రామానికి చెందిన ఉమా, ఓరైలోని బజారియా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆరీఫ్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో ఆరీఫ్, ఉమా మూడు నెలల క్రితం మతాతంతర వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఉమా ఆమె భర్త ఆరీఫ్ తో కలిసి మూడు నెలల నుంచి కాపురం చేస్తోంది.

హైవే పక్కన హైడ్రామా ఆడిన భర్త

హైవే పక్కన హైడ్రామా ఆడిన భర్త


ఓరై సమీపంలోని అజ్నారా హైవే రోడ్డు పక్కన ఉన్న డాబా దగ్గరకు భార్య ఉమాతో కలిసి ఆరీఫ్ వెళ్లాడు. హైవే పక్కనే చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. తరువాత తన భర్త ఆరీఫ్ తన మీద పెట్రోల్ పోసి నిప్పింటించి పరారైనాడని, మంటలు అదుపు చేసుకోలేక తాను విలవిలలాడి కుప్పకూిపోయానని ఉమా చెప్పిందని ఎఎస్పీ రాకేష్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.

అసలు ఏం జరిగిందో ?

అసలు ఏం జరిగిందో ?

బాధితురాలు ఉమా చాలా వరకు కాలిపోయిందని, ఆమె ఎక్కవగా మాట్లాడే పరిస్థతిలో లేదని, ఆరీఫ్ ఎందుకు అతని భార్య ఉమాకు నిప్పంటించాడు అని కచ్చితంగా తెలీదని ఎఎస్పీ రాకేష్ సింగ్ అన్నారని హిందీ దినపత్రిక అమర్ ఉజాలా తెలిపింది. ఉమా కోలుకున్న తరువాతే ఆమె భర్త ఆరీఫ్ ఎందుకు నిప్పంటించాడో తెలుస్తోందని, మెజిస్టేట్ ముందు ఉమా స్టేట్ మెంట్ ఇవ్వాలని చెబుతోందని, ఆమె కొంచెం కోలుకున్న తరువాతే మేము విచారణ చేస్తామని ఎఎస్పీ రాకేష్ సింగ్ అంటున్నారు.

Recommended Video

Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents | Oneindia Telugu
మతాంతర వివాహమా ?, లేక లవ్ జీహాద్ స్కెచ్

మతాంతర వివాహమా ?, లేక లవ్ జీహాద్ స్కెచ్


మతాంతర వివాహం చేసుకున్న ఆరీఫ్ అతని భార్య ఉమాకు నిప్పంటించి పరారు కావడంతో ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది. లవ్ జీహాద్ కారణంగానే ఉమాను హత్య చెయ్యడానికి ఆరీఫ్ ప్రయత్నించాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే డాబా యజమానిని విచారణ చేశామని, ఆరీఫ్ కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నామని ఓరై పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Love marriage: In a shocking incident, a woman was found lying on a highway with severe burn injuries in Orai area of Jalaun district of Uttar Pradesh on Tuesday morning. The incident triggered panic in the area. The woman was later admitted to Jhansi district hospital. Police said the woman got married to a youth from different faith around three months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X