
Cyclone month: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: ఇంకో రౌండ్ వర్షాలకు రెడీగా ఉండాల్సిందే
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలపై ద్రోణి ప్రభావం కనిపించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అల్పపీడనం బలహీన పడిన సందర్భంలోనూ ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వరుస వర్షాల నుంచి తెరపి లభించే పరిస్థితి లేదు. మరో విడత భారీ వర్షాలు కురవడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది.
Aliens
calling:
పాలపుంతకు
అవతలి
వైపు
నుొంచి
భూమికి
అంతుచిక్కని
సంకేతాలు:
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. సాధారణంగా అక్టోబర్‌ను సైక్లోన్ నెలగా అభివర్ణిస్తుంటారు వాతావరణ విశ్లేషకులు. ఫైలీన్, హుద్‌హుద్, తిత్లి తుఫాన్లు ఏర్పడింది ఈ నెలలోనే. వారి అంచనాలకు అనుగుణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. మధ్య బంగాళాఖాతం ఉపరితలంపై ఏర్పడిన ఆవర్తనం.. క్రమంగా అల్పపీడనంగా మారుతుందని, అది మరింత బలపడి వాయుగుండంగా అవతరిస్తుందన అంచనాలు ఉన్నాయి.

లా నినా ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని అభిప్రాయపడుతున్నారు. అండమాన్ ద్వీప సముదాయానికి ఆనుకుని సుమారు 5.2 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో నిండిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది ఈ సాయంత్రానికి అల్పపీడనంగా మారుతుందని భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ ద్రోణి 1500 కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా ఆరేబియా సముద్రంపై ఉన్న మరో ఉపరితల ఆవర్తనం వరకు వ్యాపించిందని పేర్కొన్నారు.
డైపోల్ ప్రభావంతో ఇది విస్తరించినట్లు అంచనా వేస్తోన్నారు. దీని ప్రభావం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రపై అధికంగా ఉంటుందని, క్రమంగా అది విస్తరిస్తుందని స్పష్టం చేశారు. దీని ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
విశాఖపట్నం సహా ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఉద్ధానంపై దీని తీవ్రత అధికంగా ఉంటుందనే అంచనా వ్యక్తమౌతున్నాయి. దక్షిణ కోస్తా తీరం ప్రాంతంలోని ప్రకాశం, కృష్ణా జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆగి, ఆగి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో భారీ వర్షం కురిసింది. ఈ మధ్యాహ్నం నుంచి విశాఖపట్నంలో ఓ మోస్తరు వర్షం పడుతుందనే అంచనాలు ఉన్నాయి.
Recommended Video
కనీసం 48 గంటల పాటు ఈ తరహా వాతావరణం నెలకొని ఉంటుందని, క్రమంగా అల్పపీడన ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. వచ్చే రెండు వారాల్లో జంట తుఫాన్ల ప్రభావంతో మరిన్ని వర్షాలను ఏపీ చవి చూడొచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదివరకు కొనసాగిన అల్పపీడనం ప్రభావం బలహీనపడటం వల్ల దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు, కడప పైనా దీని ప్రభావం కనిపించింది. అదే సమయంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం నెలకొని ఉండటం వల్ల మరిన్ని వర్షాలు తప్పకపోవచ్చు.