గ్యాస్ సిలిండర్ రూల్స్ బిగ్ అప్డేట్.. కొత్త కనెక్షన్లు బంద్.. సబ్సిడీ నిలిపివేత..!

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా అధికారులు కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌పీజీ కొరత నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్దిష్ట ఆదాయ వర్గాల వినియోగదారులకు ఎల్‌పీజీ సబ్సిడీని కూడా రద్దు చేశారు. అధికారుల కథనం ప్రకారం.. పశ్చిమ ఆసియాలో నడుస్తున్న సంఘర్షణతో ఏర్పడిన ఎల్‌పీజీ కొరత కారణంగా ఆగ్రాలో కొత్త కనెక్షన్ల నిలిపివేత జరిగింది. ఈ నిబంధనల కింద మరణించిన రక్త సంబంధీకులకు చెందిన కనెక్షన్లను మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి బదిలీ చేయడానికి అనుమతిస్తారు.

జిల్లా సరఫరా అధికారి ఆనంద్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం పాత ఎల్‌పీజీ కనెక్షన్లను రక్త సంబంధీకులకు బదిలీ చేయవచ్చు. "మరణించిన వారి వివరాలు తెలిసిన వారు కూడా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి ఎల్‌పీజీ కనెక్షన్ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు," అని ఆయన స్పష్టం చేశారు. నూతన ఎల్‌పీజీ సిలిండర్ నిబంధనల ప్రకారం.. వార్షిక ఆదాయం పది లక్షల రూపాయలకు పైన ఉన్న వినియోగదారులకు సబ్సిడీ నిలిపివేశారు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ. 350 సబ్సిడీ లభిస్తుండగా, సాధారణ గృహ వినియోగదారులకు సిలిండర్‌ కు సుమారు రూ. 12 సబ్సిడీ వర్తిస్తుంది.

LPG Crisis in Agra District Officials Suspend Issuance of New Connections Until Further Notice

అధికారిక గణాంకాల ప్రకారం.. ఆగ్రాలో సుమారు 1.3 మిలియన్ల ఎల్‌పీజీ వినియోగదారులున్నారు. వీరికి 88 గ్యాస్ ఏజెన్సీలు సేవలందిస్తున్నాయి. కొత్త నిబంధనల కింద ఆ 88 గ్యాస్ ఏజెన్సీలు, మూడు చమురు, గ్యాస్ కంపెనీలు కొత్త కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఎల్‌పీజీ కొరత తీవ్రతరం కావడంతో నిల్వ, బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనలను సవరించింది. మే 1 నుండి డెలివరీలకు ఓటీపీ ఆధారిత విధానం తప్పనిసరి. వినియోగదారులు ఇప్పుడు బుక్‌లెట్ లేదా రసీదు చూపించి సిలిండర్‌ లను పొందలేరు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+