LPG eKYC Update: గ్యాస్ కావాలంటే మళ్లీ ఈ-కేవైసీ ? తేల్చేసిన కేంద్రం..!

ఇరాన్ వార్ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కష్టాలు (LPG Crisis) అంతకంతకూ పెరుగుతున్నాయి. యుద్ద భయాలతో ఎక్కడికక్కడ సిలెండర్లు బ్లాక్ చేస్తుండటంతో తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఓవైపు అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా సిలెండర్ల బ్లాకింగ్ ఆగట్లేదు. దీనికి విరుగుడుగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో ఒకటి ఈ-కేవైసీని (LPG eKYC)గ్యాస్ సిలెండర్ కు తప్పనిసరి చేయడం.

దేశవ్యాప్తంగా ఎల్పీజీ తాజా పరిస్దితిపై రోజువారీ ప్రకటనలు చేస్తున్న కేంద్రం.. తాజాగా గ్యాస్ సిలెండర్ కావాలంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని వినియోగదారుల్ని కోరింది. దీంతో ఇప్పటికే ఈ-కేవైసీ చేయించుకున్న వారితో పాటు చేయించుకోకుండా గ్యాస్ సిలెండర్లు తీసుకుంటున్న వారిలోనూ ఆందోళన మొదలైంది. వీరంతా గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కట్టడం మొదలుపెట్టారు. అలాగే కేంద్రానికీ లక్షల సంఖ్యలో మెయిల్స్, మెసేజ్ లు, కాల్స్ రావడం మొదలైంది.

LPG eKYC Update Biometric Aadhaar Authentication Mandatory Only for Unauthenticated Customers

దీంతో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ఇవాళ గ్యాస్ సిలెండర్ కు ఈ-కేవైసీపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఈ-కేవైసీ చేయింంచుకున్న వారికి ఇది అవసరరం లేదని, ఇప్పటివరకూ చేయించుకోని వారికి మాత్రమే తాము ఈ-కేవైసీ చేయించుకోవాలని కోరుతున్నామంటూ వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. గ్యాస్ కొరత నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గ్యాస్ వినియోగదారులందరికీ బయోమెట్రిక్ ఆధార్ ద్వారా నిర్ధారించుకోవడమే తమ ఉద్దేశమని తెలిపింది. అలాగే ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకంలో ఉన్న వారు ఏడాదికి ఒకసారి ఈ-కేవైసీ చేయించుకుంటే సరిపోతుందని వెల్లడించింది. అదీ ఏడు రీఫిల్స్ తర్వాత తీసుకునే 8,9 రీఫిల్స్ కు మాత్రమేనని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+