వంటగ్యాస్ సిలిండర్ ధర పెరగలేదు! రూ.100 తగ్గింది

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ స్పందించింది.
వంటగ్యాస్ ధరలు పెరగలేదని, గత కొద్ది నెలలుగా వంటగ్యాస్‌ ధర తగ్గుముఖం పట్టిందని స్పష్టం చేసింది.

మే నెల వరకు వంటగ్యాస్‌ సిలిండర్‌పై దాదాపు రూ. 100వరకు ధర తగ్గిందని పేర్కొంది. వంట గ్యాస్‌ ధరలు నానాటికీ పెరుగుతున్నాయని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మంత్రిత్వశాఖ స్పందించి ఈ మేరకు ప్రకటన చేసింది.

LPG Prices Have Fallen By Nearly Rs. 100 In Five Months, Says Government

ఢిల్లీలో సబ్సీడీయేతర వంటగ్యాస్‌ సిలిండర్‌ రీటైల్‌ ధర 2017 డిసెంబరులో రూ. 747గా ఉండగా, 2018 మే నెల నాటికి ఇది రూ. 96.50 తగ్గి రూ. 650.50గా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇక సబ్సీడీ ద్వారా వినియోగదారులకు అందించే గ్యాస్‌ సిలిండర్‌ ధర గతేడాది డిసెంబరులో రూ. 495.69 ఉండగా.. ఈ ఏడాది మే నెల నాటికి రూ. 491.21కి తగ్గిందని తెలిపింది.

కాగా, ఒక్కో ఇంటికి ఏడాదికి 12 చొప్పున వంటగ్యాస్‌ సిలిండర్లకు కేంద్రం సబ్సీడీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ఎక్కువ అవసరమయ్యే వారు మాత్రం మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
LPG cylinder prices have come down this month. This is in contrast to some of the fake media reports on the alleged LPG price hikes in the recent months, said Ministry of Petroleum and Natural Gas in a press statement released on Tuesday. Since May 1, subsidised LPG (Liquefied Petroleum Gas) prices have stood at Rs. 491.21 per cylinder in Delhi, whereas they was priced at Rs. 495.69 in December last year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X