LPG Refill Booking: గ్రామాల్లో గ్యాస్ బుకింగ్స్ పై కేంద్రం ఊరట- గడువు తగ్గింపు..!

గ్రామాల్లో ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ (LPG refill booking) పై కేంద్రం ఇవాళ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్స్ కోసం అమల్లో ఉన్న 45 రోజుల గడువును తగ్గిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేశ్ గోపీ వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తల నేపథ్యంలో గతంలో చేసిన మార్పుల్ని ఇప్పుడు సవరించారు.

Quota Row: మోడీ కేబినెట్లో రిజర్వేషన్ల చిచ్చు..! మంత్రుల రాజీనామా సవాళ్లు..!
Quota Row: మోడీ కేబినెట్లో రిజర్వేషన్ల చిచ్చు..! మంత్రుల రాజీనామా సవాళ్లు..!

గతంలో ఇరాన్ యుద్దం, హార్ముజ్ జలసంధి ద్వారా భారత్ కు ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో గ్రామాల్లో గ్యాస్ సిలెండర్ల బుకింగ్ కోసం కేంద్రం 45 రోజుల గడువు పెట్టింది. అంటే ఒక సిలెండర్ బుక్ చేసుకున్న తర్వాత రెండో సిలెండర్ కావాలంటే మరో 45 రోజులు ఆగాల్సిందే. ఈ గడువును ఇప్పుడు 25 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలెండర్ల బుకింగ్ కు 25 రోజుల గడువే ఉంది. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో గ్రామాల్లోనూ ఇదే గడువు వర్తిస్తుంది.

LPG Relief Rural Consumers Can Now Book Refills Every 25 Days Same as Urban Areas
Union Cabinet: కేంద్ర కేబినెట్లో తిరుగుబాటు ? రాజీనామాకు నిరాకరిస్తున్న ఏడుగురు మంత్రులు ?
Union Cabinet: కేంద్ర కేబినెట్లో తిరుగుబాటు ? రాజీనామాకు నిరాకరిస్తున్న ఏడుగురు మంత్రులు ?


అప్పట్లో ఇరాన్ వార్ కారణంగా గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోవడంతో కేంద్రం అక్రమాలకు తెరదించే లక్ష్యంతో ఇలా రీఫిల్ బుకింగ్స్ గడువు పెంచింది. ఇప్పుడు పరిస్ధితులు అదుపులోకి రావడం, గ్యాస్ సరఫరా కూడా మెరుగుపడటంతో ఈ గడువును తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ ఇవాళ వెల్లడించారు. కేంద్రం నిర్ణయంతో పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎల్పీజీ వినియోగదారులంతా 25 రోజులకే గ్యాస్ సిలెండర్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+