LPG పై కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, భారతదేశంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరాపై అనిశ్చితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు హెచ్చరించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. వంటగ్యాస్ లభ్యత మాత్రం ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. గల్ఫ్ దేశాల్లోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకు జరిగిన నష్టంపై స్పష్టత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది.

పశ్చిమాసియా ప్రాంతంలోని ఉత్పత్తి కేంద్రాలలో.. ముఖ్యంగా ఖతార్‌లో గ్యాస్ మౌలిక సదుపాయాలు ఎంత మేరకు దెబ్బతిన్నాయనే విషయంపై ఇంకా సరైన సమాచారం రాలేదు. దీంతో అంతర్జాతీయంగా LPG ధరలు దీర్ఘకాలం పాటు అధికంగానే కొనసాగే ప్రమాదం ఉంది. శాంతి చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు సుమారు 9 శాతం తగ్గి బ్యారెల్ బ్రెంట్ ఆయిల్ 80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నప్పటికీ, వంటగ్యాస్ వినియోగదారులకు మాత్రం ఆ ఉపశమనం లభించడం లేదు.

భారత్‌ లో వంటగ్యాస్ ధరల భారం

పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి దేశంలో గృహావసరాల వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ఈ కాలంలో గృహ వినియోగ సిలిండర్ ధర మొత్తం రూ. 89 రూపాయల మేర పెంచారు. మార్చిలో ఒకసారి రూ. 60 రూపాయలు, జూన్‌ లో మరో రూ. 29 రూపాయల చొప్పున ఈ ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ. 942 రూపాయలకు చేరింది.

మరోవైపు.. వ్యాపార అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ల ధర మార్చిలో ఉన్న రూ. 1,884 రూపాయల నుంచి ఏకంగా రూ. 3,100 రూపాయలకు పెరిగింది. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు మొదలవ్వకముందు భారత్ తన LPG అవసరాలలో దాదాపు 60 శాతం వాటాను ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాల నుంచే దిగుమతి చేసుకునేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో వెల్లడించారు. అయితే.. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో దేశీయ అవసరాల కోసం అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి భారత్ గ్యాస్ దిగుమతులను వేగంగా పెంచింది.

LPG Supply Uncertainty in India May Not End Soon Despite US-Iran Ceasefire Govt Official LPG supply

ఇలా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అన్వేషించడం వల్ల మే 2026 నాటికి భారత ఎల్పీజీ దిగుమతుల్లో ఒక్క అమెరికా వాటానే 14 శాతం నుంచి ఏకంగా 55 శాతానికి చేరింది. అయినప్పటికీ, సుదూర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి ధరలు ప్రియంగానే ఉన్నాయి. గల్ఫ్ దేశాలలో గ్యాస్ ఉత్పత్తి సాధారణ స్థితికి చేరుకుని, సరఫరా పెరిగితే తప్ప దేశీయ మార్కెట్‌ లో గ్యాస్ ధరలు తగ్గవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల సామాన్యుల బడ్జెట్‌ పై ఈ భారం మరికొంత కాలం కొనసాగేలా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+