Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

LR-ASHM: హిమాలయాలంత ధైర్యం, హిందూ మహాసముద్రమంత గాంభీర్యం

ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా భారతావని తన ధీరత్వాన్ని ప్రపంచానికి చాటింది. హిమాలయాలంత ధైర్యం, హిందూ మహాసముద్రమంత గాంభీర్యం కలగలిసిన 77వ గణతంత్ర వేడుకల్లో.. భారత రక్షణ రంగ కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అదే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన లాంగ్ రేంజ్ యాంటీ-షిప్ హైపర్సోనిక్ మిస్సైల్ (LR-ASHM). శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ 'హైపర్సోనిక్' బాణం.. నవ భారత పరాక్రమానికి నిలువుటద్దంగా నిలిచింది.

శత్రువుకు అజేయం.. భారత్‌కు అమోఘం!

హైపర్సోనిక్ టెక్నాలజీ అంటే కేవలం వేగం మాత్రమే కాదు, అది ఒక అభేద్యమైన శక్తి. శబ్ద వేగం కంటే 10 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్లే ఈ LR-ASHM మిస్సైల్, గాలిలోనే తన మార్గాన్ని మార్చుకుంటూ శత్రువు రాడార్లకు అందకుండా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. సముద్ర గర్భంలో దాగి ఉన్నా, అలలపై తేలుతున్నా.. శత్రు నౌకలకు ఈ మిస్సైల్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అగ్రరాజ్యాలకే సాధ్యమైన ఈ సాంకేతికతను సొంతం చేసుకోవడం ద్వారా భారత్ నేడు ప్రపంచ రక్షణ రంగంలో 'మహారాజు'గా నిలిచింది.

LR-ASHM India Unleashes Hypersonic Power Missile Steals the Show at Republic Day Parade 2026

ప్రత్యేకతలు ఇవే...

  • సుమారు 1,500 కిలోమీటర్ల వరకు దూరంలోని లక్ష్యాలను ఛేదించే శక్తి
  • సముద్రంలో కదులుతున్న యుద్ధ నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లపై ఖచ్చితమైన దాడి
  • తక్కువ ఎత్తులో, తక్కువ రాడార్ గుర్తింపుతో ప్రయాణించే సామర్థ్యం
  • పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన సెన్సార్లు, గైడెన్స్ సిస్టమ్‌లు
  • భవిష్యత్తులో భూభాగం, నౌకలు, విమానాల నుంచి ప్రయోగించేలా అభివృద్ధి అవకాశాలు

భారత నౌకా బలానికి వ్యూహాత్మక బలం

ఈ మిస్సైల్‌తో భారత నౌకాదళానికి సముద్ర యుద్ధాల్లో స్పష్టమైన ఆధిక్యం లభించనుంది. శత్రు దేశాల భారీ నౌకా బలగాలను పెద్ద దూరం నుంచే నిర్వీర్యం చేసే సామర్థ్యం భారత్‌కు దక్కుతుంది. హైపర్సోనిక్ ఆయుధాల క్లబ్‌లో భారత్ చేరడం ద్వారా, అమెరికా, రష్యా, చైనా వంటి అగ్ర దేశాల సరసన నిలుస్తోంది.

డీఆర్‌డీవో ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణ

రిపబ్లిక్ డే పరేడ్‌తో పాటు, రెడ్ ఫోర్ట్‌లో నిర్వహించిన 'భారత్ పర్వ్' లో కూడా DRDO నౌకా సాంకేతికతలను ప్రదర్శించింది. అయితే వాటన్నింటిలోనూ LR-ASHM మిస్సైల్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. డీఆర్‌డీవో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లుగా తెలుగువారే డైరెక్టర్‌. నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన ఎ.ప్రసాద్‌గౌడ్‌ .. 30 సంవత్సరాల కిందట డీఆర్‌డీవోలో సేవలందిస్తున్నారు

అగ్ర దేశాల సరసన భారత్..

ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల వద్ద మాత్రమే ఉన్న ఈ హైపర్సోనిక్ శక్తిని ప్రదర్శించడం ద్వారా భారత్ తన గ్లోబల్ పవర్‌ను చాటిచెప్పింది. హిందూ మహాసముద్రంలో కవ్వింపులకు దిగే శత్రువులకు ఇదొక గట్టి హెచ్చరిక. సముద్ర సరిహద్దుల భద్రత ఇకపై భద్రమని, భారత్ తన జలభాగాలను కంటికి రెప్పలా కాపాడుకోగలదని ఈ మిస్సైల్ నిరూపించింది.

రిపబ్లిక్ డే 2026 పరేడ్‌లో LR-ASHM ప్రదర్శన కేవలం ఒక ఆయుధ ఆవిష్కరణ కాదు. అది భారత రక్షణ రంగంలో సాధించిన సాంకేతిక పురోగతికి ప్రతీక, అలాగే దేశ భద్రతపై భారత్ తీసుకుంటున్న దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనం. సముద్ర సరిహద్దుల భద్రతలో భారత్ ఇక మరింత బలంగా నిలవనుందని ఈ మిస్సైల్ స్పష్టంగా తెలియజేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+