వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే ట్రాక్ పక్కన డబ్బులు.. ఏరుకున్న ఊరి జనం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Mad rush after wads of cash found in bushes
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని ఫరీద్‌పూర్ తాలుకాలోని భగవాన్‌పూర్ పుల్వా అనే పల్లెటూరులో జనాలు విపత్కర పరిస్ధితులను ఎదుర్కొన్నారు. రోజూ లాగే ఊళ్లో ఉన్న ప్రజలు పొలం పనులకు వెళ్లారు.

వారితో పాటే కొంత మంది పిల్లలు తమ పశువులను మేపడానికి ఊరు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ వైపు బయలుదేరారు. ఆ పిల్లలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కనుచూపు మేర లో ఉన్న చెట్టులు, గుట్టల్లో రూ. 500, 1000 నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

దీంతో ఒక్కసారిగా ఆ పిల్లలు కేకలు వేసుకుంటూ నోట్లను ఏరటం మొదలు పెట్టారు. మరికొందరు పిల్లలు ఆ దగ్గరలోని పొలాల్లో పని చేస్తున్న తమ తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో.. వాళ్లంతా ఉరుకులు పరుగులు మీద వచ్చి నోట్లను ఏరుకున్నారు.

ఏరిన డబ్బులన్నింటినీ.. చీరల్లో, జేబుల్లో చివరికి లోదుస్తుల్లో కూడా కుక్కుకొని పరుగుపరుగున ఊరికి వెళ్లిపోయారని అక్కడున్న ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న సమీపంలోని రెండు పోలీసు స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చారు.

ఫతేగంజ్ ఈస్ట్ స్టేషన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రామ్‌వీర్ యాదవ్ మాట్లాడుతూ డబ్బు దొరికిన ప్రాంతం మా పరిధిలోకి వస్తుందంటే.. మా పరిధిలోకి వస్తుందంటూ వాగ్వాదానికి దిగారు. పొలాల్లో పడి ఉన్న ఈ డబ్బు సుమారుగా రూ. 6 నుంచి 7 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేశారు.

English summary
A group of boys grazing their livestock stumbled upon stacks of currency notes in the denominations of Rs 1,000, 500 in bushes near a railway track in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X