చీనాబ్ వంతెన కోసం 17 ఏళ్లు కృషి.. ప్రొఫెసర్ మాధవి లత గురించి షాకింగ్ విషయాలు తెలుసా..?
ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తయినది ఈఫిల్ టవర్, న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాదు.. జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ రైల్వే వంతెన. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దాదాపు రూ. 1,486 కోట్లు ఖర్చు పెట్టి ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జమ్మూ కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా చరిత్ర సృష్టించింది.
చీనాబ్ వంతెన విశిష్టత ఏంటంటే చీనాబ్ నది ఉపరితలంపై 359 మీటర్ల ఎత్తులో ఈ వంతెన నిర్మాణం జరిగింది. అయితే ఈ వంతెన నిర్మాణం వెనుక ప్రొఫెసర్ మాధవి లత 17 ఏళ్ల కృషి దాగుంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ఆమె ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ బ్రిడ్జి కోసం ఆమె 17 ఏళ్లు కృషి చేశారు. వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ చేసిన ఆమె జియో టెక్నికల్ ఇంజినీర్ గా చీనాబ్ వంతెన నిర్మాణంలో తన వంతు కృషి చేశారు.
మాధవి లత ఐఐటీ మద్రాస్ నుంచి 2000 సంవత్సరంలో డాక్టరేట్ పొందారు. అప్పటి నుంచి ఆమె అనేక అవార్డులు కైవసం చేసుకున్నారు. 2021లో బెస్ట్ ఉమెన్ జియోటెక్నికల్ రీసెర్చర్ అవార్డు అందుకున్నారు. 2022 లో స్టీమ్ ఆఫ్ ఇండియా టాప్ 75 విమెన్ లో ఆమె పేరు ఉంది. ఆమె ఎనలేని కృషి కారణంగా చీనాబ్ వంతెన సాకారం అయింది.

ఈ చీనాబ్ బ్రిడ్జిని రూ. 14,00 కోట్లతో నిర్మించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో జమ్ముకశ్మీర్ లోని లక్షల మంది ప్రజల కల సాకారం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన కట్రా- శ్రీనగర్ వందేభారత్.. జమ్ము ప్రాంతాన్ని కాశ్మీర్ తో కలిపే తొలి రైలు కావడం విశేషం. ఇదివరకు కట్రా- శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 3 గంటలు పడుతుండగా ఇప్పుడు ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో గంట సమయం ఆదా కానుంది.












Click it and Unblock the Notifications