వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంను కాంగ్రెస్‌తో పోల్చిన కాంగ్రెస్ నేత, నీకు పార్టీయే అన్యాయం చేసిందని బీజేపీ కౌంటర్

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల అంశమే బీజేపీకి అతిపెద్ద సమస్య అని కాంగ్రెస్ పార్టీ నేత అరుణ్ యాదవ్ అన్నారు. తాను మధ్యప్రదేశ్‌లో దెయ్యంతో పోరాడుతున్నానని బీజేపీ నేత, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బుద్నీ నియోజకవర్గంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున అరుణ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిని దెయ్యంతో పోలుస్తూ మండిపడ్డారు. ఈసారి కాంగ్రెస్‌దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంతో పాటు తన నియోజకవర్గం ప్రజలను కూడా మోసం చేశారని చెప్పారు. రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్నారు. పదిహేనేళ్ల బీజేపీ పాలనలో ఏ అభివృద్ధీ లేదన్నారు. అట్రాసిటీ కేసులు ఎక్కువయ్యాయని ఆరోపించారు.

Madhya Pradesh Assembly Polls 2018: I am fighting a devil in Budhni, says Congress Arun Yadav

శివ్‌రాజ్‌ సింగ్ చౌహాన్ పైన పోటీ చేయడానికి కాంగ్రెస్ తనను ఎంచుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. సీఎంను దెయ్యంతో ఎందుకు పోల్చానో చెప్పారు. దేశంలో మహిళల మీద దాడులు మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, సీఎం నియోజకవర్గంలో మరీ ఎక్కువ అన్నారు.

నిరుద్యోగం పెరిగిందన్నారు. అవినీతి, కుంభకోణాలు ఎక్కువయ్యాయని చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. బీజేపీ పాలనలో ప్రజలు కనీస అవసరాలకు కూడా దూరమయ్యారన్నారు.

నీకు కాంగ్రెస్ అన్యాయం చేసింది!: బీజేపీ

అనిల్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో స్కాంలు జరిగాయని, బీజేపీ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ ఆయనను ఓ పావులా వాడుకుంటోందన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించి, బుధ్నీ నుంచి పోటీకి దింపి ఆయనకు అన్యాయం చేసిందన్నారు. కాగా, 2013 అసంబ్లీ ఎన్నికల్లో బుధ్నీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ 84,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి ఆ మెజార్టీని లక్షకు పెంచాలని బీజేపీ భావిస్తోంది.

English summary
Locked in a pitched electoral battle against Madhya Pradesh's three-time Chief Minister Shivraj Singh Chouhan, Congress candidate Arun Yadav has said he is fighting a "devil" in Budhni and accused him of cheating people of his constituency and of the entire state by perpetrating "maximum atrocities".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X