వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ పాలనలో బుల్‌డోజర్లు అంబులెన్సులయ్యాయ్..!!

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి బుల్‌డోజర్‌ను వినియోగించాల్సిన దుస్థితి ఏర్పడింది. అంబులెన్స్‌కు సమాచారం అందించినప్పటికీ- సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేకపోవడంతో స్థానికులు అందుబాటులో ఉన్న బుల్‌డోజర్‌ను వినియోగించుకున్నారు. బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ ప్రభుత్వ పాలనలో ఏర్పడిన దుస్థితిని ప్రపంచానికి తెలియజెప్పింది.

మధ్యప్రదేశ్‌లోని కత్నిలో చోటు చేసుకుందీ ఘటన. బర్హి-ఖతౌలీ మార్గంలో రెండు బైక్‌లు పరస్పరం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు సహాయం కోసం 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ప్రమాద తీవ్రత, గాయపడ్డ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సిబ్బందికి వివరించారు. అయినప్పటికీ- అంబులెన్స్ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోలేదు. అంబులెన్స్ సర్వీసుల ఏజెన్సీ చేతులు మారిందని, అందుకే జాప్యం ఏర్పడిందని తెలిపారు.

Madhya Pradesh: Bulldozer Carries Accident Victim To Hospital in Katni

గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆటోడ్రైవర్లు కూడా ముందుకు రాలేదు. సుమారు అరగంట పాటు అక్కడే ఇతర వాహనాల కోసం ఎదురు చూసినా ఫలితం రాలేదు. దీనితో స్థానికులు అందుబాటులో ఉన్న జేసీబీలో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. జేసీబీ ముందు ఉండే బకెట్‌లో అతణ్ని హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సకాలంలో తీసుకుని రావడంలో అతని ప్రాణాలు నిలిచాయని డాక్టర్లు చెప్పారు.

కాలు ఫ్రాక్చర్ అయిందని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రదీప్ ముధియా చెప్పారు. కొత్త అంబులెన్స్‌ల కోసం ప్రతిపాదనలు పంపించామని మంజూరు కావట్లేదని ప్రదీప్ ముధియా పేర్కొన్నారు. తన షాప్ ముందే ప్రమాదం చోటు చేసుకుందని బర్హి పంచాయతీ సభ్యుడు, జేసీబీ యజమాని పుష్పేంద్ర విశ్వకర్మ చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశామని, సకాలంలో రాలేదని అన్నారు. నాలుగైదు ఆటోలను మాట్లాడినప్పటికీ- డ్రైవర్లెవరూ రాలేదని, దీనితో జేసీబీలో తరలించామని చెప్పారు.

English summary
A viral video on social media showed that an accident victim was taken to the hospital on a JCB machine in Madhya Pradesh's Katni district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X