గిరిజన యువకుడిపై మూత్రం పోసిన వ్యక్తి ఇంటిని కూల్చేసిన చౌహాన్ సర్కారు

భోపాల్: నేరస్తులను బెంబేలెత్తించే బుల్డోజర్ సంస్కృతి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్‌కు వ్యాపించింది. ఆక్రమణదారులు, గ్యాంగ్‌స్టర్లు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి పట్ల ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వారి ఆస్తులను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది.

ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బుల్డోజర్‌ను ఉపయోగిస్తున్నారు. అమానవీయ సంఘటలకు పాల్పడిన వారి ఆస్తులను కూడా బుల్డోజర్‌తో వారి ఆస్తులను నేలమట్టం చేస్తున్నారు. ఇటీవల గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్రం పోసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ చౌహాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసింది.

 Madhya Pradesh: Bulldozer Demolishes Mans Home After He Urinates On Tribal Person

అంతకుముందు జరిగిన పరిణామాలను గమనించినట్లయితే.. రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో కాంగ్రెస్ సహా విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ కూడా స్పందించారు. ఇలాంటి హేయమైన చర్యలకు నాగరిక సమాజంలో చోటు లేదని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై జరుగుతున్న ఆకృత్యాలు అంతం కావాలన్నారు కమల్‌నాథ్.

'ఈ దారుణం ప్రభుత్వానికి కనిపించలేదా? నేరస్తుడిని ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు?' అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితుడు బీజేపీ ఎమ్మెల్యేకి అనుచరుడని అందుకే అతడిని అరెస్ట్ చేయలని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా స్పందించారు. నిందితుడికి బీజేపీతో సంబంధం లేదని, అతడు తన అనుచరుడు కూడా కాదని ఎమ్మెల్యే శుక్లా స్పష్టం చేశారు.

మరోవైపు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తన దృష్టికి వచ్చినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నేరస్తుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, అతడిపై కఠన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక, నిందితుడిపై ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వై సతీష్ రెడ్డి కూడా వ్యక్తి మూత్ర విసర్జనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంతేగాక, నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడంటూ ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తప్పుడు వార్తలంటూ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+