"నా భర్తకు 40ఏళ్లు.. నాకు 19ఏళ్లు.. ప్రియుడితోనే ఉంటాను" కోర్టు సంచలన తీర్పు..
మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఒక అడల్ట్ మహిళకు తన భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉందని కీలక తీర్పునిచ్చింది. 'నా భర్తకు 40 ఏళ్లు.. నాకు 19 ఏళ్లు.. మా ఆయనతో కలిసి ఉండలేను.. అందుకే ప్రియుడితో వెళ్లిపోయాను' అని కోర్టుకు తెగేసి చెప్పిన మహిళ కేసులో విచారణ అనంతరం ఆమె వాదనలను ఏకీభవించిన కోర్టు సదరు మహిళ ఆమె లవర్ తో ఉండేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తనకు వివాహం జరిగి 7 ఏళ్లు అయిందని.. అయితే తన భార్య తనతో కాకుండా ప్రియుడు అనూజ్ కుమార్ తో ఉంటోందని.. ఎలాగైనా తన భార్యను తన చెంత చేర్చాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు ఓ వ్యక్తి. ఇక ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి భార్యను వెతికి పట్టుకున్నారు. కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆమెతో పాటు ప్రియుడు, భర్త, కుటుంబ సభ్యులు కోర్టులోనే ఉన్నారు.
అదే సమయంలో భర్త ఉండగా ఇలా ఎందుకు చేశావని అడగ్గా.. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'నా భర్తకు 40 ఏళ్లు.. నాకు 19 ఏళ్లు.. మా ఆయనతో కలిసి ఉండలేను.. తమ మధ్య వైవాహిక జీవితం ఆశించిన విధంగా లేదు.. అందుకే ప్రియుడితోనే ఉంటా' అని తేల్చి చెప్పింది. అయితే ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ కౌన్సిలింగ్ ద్వారా ఆమె మనసు మారలేదు. కౌన్సిలింగ్ సెషన్స్ తర్వాత కూడా.. తన ప్రియుడితోనే ఉంటానని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పింది.

మరోవైపు ఇదే విషయంపై కోర్టు ప్రియుడ్ని ప్రశ్నించగా.. తనను జీవితాంతం కష్టపెట్టకుండా చూసుకుంటానని న్యాయస్థానం ముందు హామీ ఇచ్చాడు. ఈ వాదనలన్నీ విన్న తర్వాత జస్టిస్ ఆనంద్ పాతక్, జస్టిస్ పుష్పేంద్ర యాదవ్ డివిజన్ బెంచ్ ఆమె నిర్ణయానికి విలువ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఆ మహిళ తన ప్రియుడితో ఉండేందుకు ఓకే చెప్పింది. ఒక అడల్ట్ కు ఎవరితో కలిసి ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications