అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత కేసు: సుప్రీం కోర్టు నో, పన్నీర్ సెల్వం వర్గానికి షాక్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలు అయిన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యే సెమ్మలై దాఖలు చేసిన పిటిషన్ విచారణ చెయ్యలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

సీఎం పళనిస్వామికి వ్యతిరేకం !

సీఎం పళనిస్వామికి వ్యతిరేకం !

ఈ ఏడాది పిటిషన్ ఫిబ్రవరిలో తమిళనాడు శాసన సభలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి బలపరీక్ష నిర్వహించిన సమయంలో పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు !

స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు !

పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఓటు వేసిన 11 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎడప్పాడి పళనిస్వామి వర్గీయులు స్పీకర్ ధనపాల్ కు ఫిర్యాదు చేశారు. ఎడప్పాడి పళనిస్వామి వర్గీయులు చేసిన ఫిర్యాదుపై స్పీకర్ ధనపాల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మద్రాసు హైకోర్టులో డీఎంకే పార్టీ !

మద్రాసు హైకోర్టులో డీఎంకే పార్టీ !

స్పీకర్ ధనపాల్ పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలను అనర్హులు చెయ్యాలని డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సుప్రీం కోర్టులో పన్నీర్ వర్గం !

సుప్రీం కోర్టులో పన్నీర్ వర్గం !

డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన ఫిటిషన్ విచారణ పెండింగ్ లో ఉంది. డీఎంకే పార్టీ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టుకు బదిలి చెయ్యాలని పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యే సెమ్మలై సుప్రీం కోర్టులో మనవి చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు.

ఇక్కడ కుదరదు, సుప్రీం కోర్టు

ఇక్కడ కుదరదు, సుప్రీం కోర్టు

పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యే సెమ్మలై సమర్పించిన పిటిషన్ దాఖల చేసిన పిటిషన్ పరిశీలించిన సుప్రీం కోర్టు 11 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ మద్రాసు హైకోర్టులోనే జరపవచ్చని, దీనిని సుప్రీం కోర్టు విచారణ చెయ్యాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మరెమైనా కోర్కెలు ఉన్నా మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Supreme Court said the Madras High Court would decide on the pleas seeking disqualification of 11 AIADMK MLAs including former Chief Minister O Panneerselvam, who had voted against the E K Palaniswami government in the February trust vote.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి