AP Weather: 47.6 డిగ్రీలతో పిడుగురాళ్ల రికార్డు..! రేపటి నుంచి నిప్పుల కొలిమే..!
ఏపీలో ఎండ ఉధృతి (Weather) తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్ధితి. ఇదే క్రమంలో ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీజన్ లోనే అత్యధికంగా 47.6 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. రానున్న నాలుగురోజులు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తోంది.
ఇవాళ రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు (Heatwave) రికార్డయ్యాయని వాతావరణ విభాగం తెలిపింది. పల్నాడు జిల్లాలో 23, కృష్ణాలో 21, ప్రకాశంలో 20, ఏలూరులో 20, బాపట్లలో 17, నెల్లూరులో 16, ఎన్టీఆర్ లో 15, గుంటూరులో 15, మార్కాపురం జిల్లాలోని 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. రేపు గురువారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, మార్కాపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 - 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 - 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఎల్లుండి శుక్రవారం అయితే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 - 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కాకినాడ, నంద్యాల మరియు వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44- 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకాళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 - 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

శనివారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 - 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 - 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 - 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే రేపు 74 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 232 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 24 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 270 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నాయి.
వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో:
https://apsdma.ap.gov.in/files/f1cd56924615bb5ed7c8fc216c004a2c.pdf














Click it and Unblock the Notifications