వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిడ్డకు ఆస్తి, కూతురు ముందు తల్లితో పెళ్లి

|
Google Oneindia TeluguNews

చెన్నై: అత్యాచారం చేసి ఒక బిడ్డకు తల్లిని చేసిన వ్యక్తి చివరికి హై కోర్టు జోక్యంతో ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. అందుకు ప్రతిఫలంగా తనకు పుట్టిన కుమార్తె మీద ఆస్తి రాసివ్వడానికి అతను, అతని కుటుంబ సభ్యులు అంగీకరించడంతో కేసు రాజీ అయ్యింది.

తమిళనాడులోని తత్తుకుడి గ్రామంలో మోహన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను 2008వ సంవత్సరంలో అదే గ్రామంలో నివాసం ఉంటున్న 15 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేశాడు. బాలిక ఆడబిడ్డకు జన్మనిశ్చింది. ఇప్పడు ఆ బాలికకు 6 సంవత్సరాలు దాటింది.

కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. స్థానిక కోర్టు మోహన్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 లక్షల అపరాధ రుసుం విధించింది. మోహన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అప్పటి నుండి పలు వాయిదాలలో కేసు విచారణ జరిగింది.

Madras High Court judge gives bail to rape accused to 'mediate' with victim

అయితే రాజీ అవుతామని బాధితురాలు, నిందితుడు కోర్టులో అర్జీ సమర్పించలేదు. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తి డి. దేవదాస్ జోక్యం చేసుకున్నారు. మీరు ఎందుకు రాజీ కాకూడదు అని ఇద్దరి ప్రశ్నించారు. రాజీ కావాడనికి ప్రయత్నించండి అని సలహ ఇచ్చారు.

నిందితుడు మోహన్ తాను బాధితురాలిని వివాహం చేసుకుంటానని కోర్టులో చెప్పాడు. బాధితురాలికి తల్లిదండ్రులు లేరు. అన్ని ఆలోచించిన ఆమె తన కుమార్తె పేరు మీద ఆస్తి రాసిస్తే వివాహం చేసుకొవడానికి తాను సిద్దం అని చెప్పింది. వివాహం చేసుకుని భార్య, బిడ్డను జాగ్రతగా చూసుకోవాలని మోహన్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

English summary
Citing religion and its capacity for reconciliation, Justice D Devadass of Madras High Court today referred the case of a minor’s rape for mediation between the victim and accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X