ప్రముఖ నటుడి దాడి కేసు: బెయిల్ కోసం హైకోర్టుకు, అజ్ఞాతంలోకి, బీజేపీ నాయకులు ఫైర్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్, బీజేపీ నాయకుడు షణ్ముగ సుందరం, న్యాయవాది ప్రేమ్ ఆనంద్ మీద దాడి చేసిన కేసులో తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు సంతానం ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.

రియల్ ఎస్టేట్ గొడవ: బిల్డర్, లాయర్ ముఖం పచ్చడి చేసిన ప్రముఖ నటుడు, కేసు, ఎస్కేప్ !

నటుడు సంతానం గురువారం తన న్యాయవాది సహాయంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేశాడు. నటుడు సంతానం పిటిషన్ విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

Madras High Court postponed actor Santhanam anticipatory bail

కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించే విషయంలో మనస్పర్థలు రావడంతో గత సోమవారం రాత్రి నటుడు సంతానం, ఆయన మేనేజర్ రమేష్ తోపాటు మరో వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి షణ్ముగ సుందరం కార్యాలయానికి వెళ్లి గొడవ చేశారు. ఆ సందర్బంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి షణ్ముగ సుందరంతో పాటు న్యాయవాది ప్రేమ్ ఆనంద్ ను చితకబాదేశారు.

బెంగళూరు జైలుకు శశికళ: పెరోల్ నియమాలు ఉల్లంఘించారని, భర్త కోసం వచ్చి రాజకీయాలు !

చెన్నై నగర పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నటుడు సంతానం ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. నటుడు సంతానంను అరెస్టు చేసే విషయంలో పోలీసులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ తమిళనాడు శాఖ నాయకులు మండిపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Santhanam anticipatory bail case postponed to tomorrow. Actor Sathanan abscond in the case of Attacking a lawyer.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి