మహా కుంభమేళాలో కరోనా బారిన పడిన 20 మంది పరారీ .. కేసు నమోదు చేసి వెతుకుతున్న పోలీసులు

ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న మహా కుంభమేళా కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తెహ్రీ జిల్లాలోని మునికి రెటి ప్రాంతంలోని ఆసుపత్రి నుంచి 20 మంది కోవిడ్ -19 పాజిటివ్ రోగులు పరారు కావడంతో రోగులపై ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

కుంభమేళాలో పాల్గొన్న 20 మంది భక్తులకు కరోనా.. ఆస్పత్రి నుండి పరారీ , కేసు నమోదు

కుంభమేళాలో పాల్గొన్న 20 మంది భక్తులకు కరోనా.. ఆస్పత్రి నుండి పరారీ , కేసు నమోదు

మహాకుంభమేళాలో పాల్గొన్న 20 మంది భక్తులు కరోనా బారిన పడ్డారు. వారిని తెహ్రీ జిల్లాలోని ముని కి రెటి ప్రాంతంలోని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో వారు అక్కడినుంచి పారిపోయారు. దీంతో వారిపై కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు, ఇతర వ్యక్తుల ప్రాణాలకు అపాయం కలిగించినందుకు పారిపోయిన 20మంది కరోనా పాజిటివ్ రోగులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ సంజయ్ గుంజ్యాల్ తెలిపారు.

పరారీలో ఉన్న వారిని వెతకటానికి రంగంలోకి దిగిన పోలీసు బృందాలు

పరారీలో ఉన్న వారిని వెతకటానికి రంగంలోకి దిగిన పోలీసు బృందాలు

ప్రస్తుతం పరారీలో ఉన్న కరోనా పాజిటివ్ రోగుల కోసం వెతకడానికి బృందాలను నియమించారు. ఇక వారిని ఉద్దేశించి రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేసామని పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మహా కుంభ మేళా ను సందర్శించారు . ఆ తర్వాత వారు కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు.
మహా కుంభ మేళా నేపధ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి .

నిన్నటి వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్రియాశీల కేసులు 17,293

నిన్నటి వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్రియాశీల కేసులు 17,293

ఉత్తరాఖండ్ రాష్ట్రం 57 వ వారంలో (ఏప్రిల్ 11-17) గరిష్టంగా 13,924 కరోనా కేసులను నమోదు చేసింది.
27 మంది ప్రాణాలు కోల్పోయిన 56 వ వారంతో పోల్చితే మరణాల సంఖ్య 104 కి పెరిగింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2630 కొత్త కేసులను గుర్తించడంతో ఉత్తరాఖండ్‌లో ఆదివారం క్రియాశీల కేసులు 17,293 కు చేరుకున్నాయి. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాష్ట్ర ముఖ్య అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

కరోనా కట్టడి కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు

కరోనా కట్టడి కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు

మాస్కులు ధరించని వారికి విధించే జరిమానాను రూ .200 నుంచి రూ .500 కు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు

. హరిద్వార్ లో కొనసాగుతున్న మహా కుంభమేళా మినహా వివాహాలు మరియు ఇతర బహిరంగ సభలలో అనుమతించవలసిన అతిథుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం 100 కు తగ్గించింది. కరోనా కట్టడి కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+