Maha Kumbh Mela: శివరాత్రి రోజుతో ముగిసిన మహా కుంభమేళా, అర్ధరాత్రి వరకూ కోట్లాది భక్తులు
Maha Kumbhmela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ముగిసింది. 45 రోజులపాటు ఘనంగా జరిగిన కుంభమేళా ఉత్సవాలు బుధవారం ముగిశాయి. కుంభమేళా చివరి రోజు శివరాత్రి పర్వదినం కావడంతో దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు.
కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో మహా శివరాత్రినాడు కుంభమేళా ముగిసింది. మహా కుంభమేళా ముగింపు వేడుకలకు పదివేల మందికిపైగా నాగ సాదువులు కాశీ వీధుల గుండా దేవతా మూర్తుల విగ్రహాలతో 'హర్ హర్ మహాదేవ్' అంటూ భారీ ప్రదర్శన చేపట్టారు. కాగా, చివరి రోజైనా శివరాత్రి నాడు మహా కుంభమేళాకు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇందుకు తగినట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

కుంభమేళా చివరి రోజునాడు సుమారు 2 కోట్లకుపైగా మంది భక్తులు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. మహా కుంభమేళా చివరిరోజున హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళా అనేక రికార్డులను నమోదు చేసింది. పలు దేశాల జనాభా కంటే ఈ కుంభమేళాకు హాజరైన భక్తుల సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ మహా కుంభమేళా గతంలో ఎన్నడూ లేనంతగా మరింత ఘనంగా, దైవికంగా నిర్వహించారు. దేశం నంచేగాక ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. సామాన్యుల నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు పవిత్ర స్నానం ఆచరించడానికి ఈ మహా కుంభమేళాకు చేరుకున్నారు. చివరి రోజు అర్ధరాత్రి వరకు మహా కుంభమేళాలో భక్తులు స్నానమాచరించారు.
మంగళవారం వరకు త్రివేణి సంగమంలో 66 కోట్లకు పైగా ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 13న ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం, 2025 మహా కుంభమేళాలో 45 రోజుల్లో 66.21 కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానం చేసి, ప్రపంచంలోని మరే ఇతర కార్యక్రమంలోనూ లేని చారిత్రక రికార్డును సృష్టించారు. ఈ సంఖ్య భారతదేశ జనాభాలో దాదాపు 50%, ఇది అనేక యూరోపియన్ దేశాల జనాభా కంటే ఎక్కువ.
ఈ 45 రోజుల కార్యక్రమంలో ఆరు ప్రధాన స్నానోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. మహా కుంభమేళాలో పలువురు రాజకీయ నాయకులతోపాటు బాలీవుడ్ ప్రముఖులు పవిత్ర స్నానాలు ఆచరించారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, పంకజ్ త్రిపాఠి వంటి ప్రముఖులతో పాటు రెమో డిసౌజా, షాన్, కైలాష్ ఖేర్, శేఖర్ సుమన్, ఉదిత్ నారాయణ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
VIDEO | Drone visuals of Sangam Nose as lakhs of devotees throng Triveni Sangam to take holy dip on the occasion of #Mahashivratri2025.#MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/TodO2wvj1R
— Press Trust of India (@PTI_News) February 26, 2025
మహా కుంభమేళాకు తరలివచ్చిన ప్రముఖులు
దేశంలోని కోటీశ్వరులైన వ్యాపారవేత్తలు మహా కుంభమేళాకు వచ్చారు. ముఖేష్ అంబానీ తన కుటుంబంతో పాటు, గౌతమ్ అదానీ, అనిల్ అంబానీ, ఓలాకు చెందిన భవిష్ అగర్వాల్, లక్ష్మీ మిట్టల్, ఆనంద్ పిరమల్, అశోక్ హిందూజా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పవిత్ర స్నానాలు ఆచరించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సహా రాజకీయ నాయకులు కూడా మహా కుంభమేళాకు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అనేక మంది కూడా పవిత్ర స్నానాల కోసం సంగం చేరుకున్నారు. వీరితోపాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, అసెంబ్లీ స్పీకర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications