నవాబ్ మాలిక్-ఫడ్నవీస్ పోరు తీవ్రం-క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావాకు మంత్రి హెచ్చరిక
మహారాష్ట్రలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. ఆర్యన్ ఖాన్ ను సమర్ధించేందుకు రంగంలోకి దిగిన మహారాష్ట్రమంత్రి నవాబ్ మాలిక్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆయన కూడా అంతే దీటుగా స్పందించడం ప్రారంభించారు. ఇదే కోవలో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో నవాబ్ మాలిక్ మాటలయుద్ధం మొదలైంది. ఇద్దరూ పరస్పరం అండర్ గ్రౌండ్, మాఫియా సంబంధాలను అంటగట్టుకోవడంతో ఈ పోరు మరింత ముదిరింది.
తనకు మాఫియా సంబంధాలు అంటగడుతూ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ఆరోపలణలపై ఆగ్రహంగా ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇప్పుడు ఆయనకు హెచ్చరికలు చేస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని మాలిక్ ఇవాళ హెచ్చరించారు. మాలిక్ ఇంట్లో డ్రగ్స్ దొరికాయంటూ ఫడ్నవీస్ చేసిన ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్, ఫడ్నవీస్ వ్యాఖ్యలపై లీగల్ నోటీసు పంపారు. ఈ ఏడాది ప్రారంభంలో సమీర్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. సమీర్ ఖాన్ తన న్యాయవాది ద్వారా, అతని వద్ద ఎటువంటి డ్రగ్స్ దొరకలేదని వెల్లడించారు. దీంతో పాటు మాజీ సీఎం ఫడ్నవీస్ నుంచి రూ. 5 కోట్ల పరువు నష్టపరిహారం కోరారు.

వాస్తవానికి ఫడ్నవీస్, మాలిక్ పోరుతో ఈ కేసులో ఆర్యన్ ఖాన్, సమీర్ వాంఖడే వ్యవహారం తెరమరుగైంది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించడం, సమీర్ వాంఖడేను ఈ కేసు నుంచి బదిలీ చేయడంతో వీరిద్దరి గురించి చర్చ ముగిసిపోయింది. దీంతో ఫడ్నవీస్, మాలిక్ చర్చ ఇప్పుడు కలకలం రేపుతోంది. మాలిక్ నోటీసులపై ఫడ్నవీస్ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications