IRCTC టెంట్ సిటీ టికెట్లు కావాలా?

IRCTC tent city tickets: మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు.

ఈ నెల 13వ తేదీన మహా కుంభ మేళా ఆరంభం కాగా.. ఇప్పటివరకు ఆరు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజే కోటి మందికి పైగా పుణ్యస్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మహా కుంభ మేళా మరుసటి రోజును అమృత పుణ్య స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

Mahakumbh 2025 Huge demand for IRCTC tent city at Prayagraj

మకర సంక్రాంతి పండగ కూడా తోడు కావడంతో లక్షలాది మంది భక్తులు, సాధవులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ తెల్లవారుజాము నుంచే ఈ ప్రదేశం మొత్తం జనసంద్రంగా మారింది. అఘోరీలు, అఖాడాలు, నాగాసాధువులతో ప్రయాగ్‌రాజ్ సందడిగా మారింది.

మహా కుంభమేళాను సందర్శించడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే వారి కోసం ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేష్ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేకంగా రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. భారత్ గౌరవ్ యాత్రా స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌లో మహా కుంభమేళాకు వెళ్లి రావొచ్చు. సికింద్రాబాద్ సహా దేశంలోని వివిధ ప్రధాన నగరాల నుంచి మహాకుంభ్ ప్రత్యేక రైళ్లు నడుస్తోన్నాయి.

అదే సమయంలో- భక్తుల సౌకర్యం కోసం ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేకంగా టెంట్ సిటీని ఏర్పాటు చేసింది ఐఆర్‌సీటీసీ. దీనికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ నెల 30వ తేదీ వరకూ టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తం రెండు కేటగిరీల్లో అంటే సూపర్ డీలక్స్, విల్లా టైప్‌లో టెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కేటగిరీకి ఒక్కో రకంగా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

సూపర్ డీలక్స్ కేటగిరీలో ఒకరికి రూ. 18,000, ఇద్దరికి రూ. 18,000, ఎక్స్‌ట్రా బెడ్‌కు 5,000 రూపాయలను చెల్లించాలి. విల్లా కేటగిరీలో ఒకరికి రూ. 20,000, ఇద్దరికి రూ. 20,000, ఎక్స్‌ట్రా బెడ్‌కు 7,000 రూపాయలను చెల్లించాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇందులోనే వసూలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+