Mahakumbh Mela 2025: సంరంభం ఆరంభం - స్నాన ముహూర్తాలు, ప్రత్యేకతలు..!!
ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. అతి పెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభ మేళా ఆరంభమైంది. ఈ వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో రాజస్నానంతో పవిత్ర ఘట్టానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఆ ఆధ్యాత్మిక వేడుక ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. దాదాపు 40 కోట్ల మంది ఈ కుంభమేళాకు తరలి వస్తారని అంచనా. ఇప్పటికే పవిత్ర త్రివేణీ సంగమం భక్తులతో నిండిపోయింది.
తొలి స్నానాలు ఆరంభం
ప్రపంచంలోనే అతి పెద్దదిగా చప్పుకొనే మహా కుంభమేళా ప్రారంభమంది. సోమవారం పుష్య పౌర్ణమి రోజు తొలి షాహీ స్నాన్ సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. తొలి రోజున పవిత్ర స్నాన ముహూర్తం ఉదయం 5.54 నుంచి 7.15 వరకు ఉన్నట్లు ప్రకటించారు. అదే విధంగా విజయ ముహూర్తం - మధ్యాహ్నం 2:15 నుంచి 2:57 కాగా,సంధ్యా సమయం - సాయంత్రం 5.42 నుంచి 6.09 వరకు ఉన్నట్లు నిర్వా హకులు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కుంభమేళాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహించే మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి దాదాపు 35 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది.

భారీ ఏర్పాట్లు
కుంభమేళా ఆరంభానికి ముందు రోజునే 25 లక్షల మంది ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరిం చారు. మహాకుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్‌ను అందంగా తీర్చిదిద్దారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, కల్పవాసీలు, భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. 10 వేల ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. పెద్ద సంఖ్యలో టెంట్లు ఏర్పాట్లు చేసి భక్తులకు వసత కల్పించారు.
#WATCH | Prayagraj | Devotees at the bank of Triveni Sangam - a scared confluence of rivers Ganga, Yamuna and 'mystical' Saraswati as today, January 13 - Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025 pic.twitter.com/JIOc8Oo34y
— ANI (@ANI) January 13, 2025
ఆరు రోజులు ప్రత్యేకం
జనవరి 13న పుష్యపౌర్ణమి, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, 26న మహా శివరాత్రి సందర్భంగా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ 3వేల ప్రత్యేక రైళ్లతోపాటు మొత్తంగా 13 వేల రైళ్లను నడుపుతోంది. అదే విధంగా అన్ని రంగాల ప్రముఖులు ప్రత్యేకంగా ఈ ఆరు రోజుల్లో కుంభమేళా లో పవిత్ర స్నానం కోసం ప్రయాగ్ రాజ్ కు వచ్చేందుకు ప్రణాళికులు సిద్దం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications