ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన 10 మంది మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం
ముంబై: మహారాష్ట్రలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంకలేశ్వర్- బుర్హాన్‌పూర్ హైవేపై ఓ ఎస్‌యూవీ, డంపర్ ట్రక్ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. చోప్డాలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన తిరిగి తమ స్వగ్రామమైన ముక్తయినగర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను మంగళ డీ చౌదరి(65), ప్రభాకర్ ఎన్ చౌదరి(60), ప్రభా బీ చౌదరి (40), అశ్లేషా యూ చౌదరి(28), సోనాలి జే చౌదరి(34), రియా జే చౌదరి(22), ప్రియాంక ఎన్ చౌదరి(29), సోనాలి ఎస్ మహాజన్(34), సుమన్ ఎస్ పాటిల్(55), సంగీత ఎం పాటిల్(40)గా గుర్తించారు.

గాయపడిన వారిలో శివమ్ పీ చౌదరి, మీనా పీ చౌదరి, సర్వేశ్ ఎన్ చౌదరి, అదితి ఎం పాటిల్, సునీత ఆర్ పాటిల్, గాయపడిన వారిలో ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఘటనలో గాయపడిన ఎస్‌యూవీ డ్రైవర్‌ను ధన్‌రాజ్ జీ కోహ్లీగా గుర్తించారు. డంపర్ ట్రక్ డ్రవర్‌ను ముకుంద్ జీ భంగలేగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై బాధితుల బంధువులకు సమాచారం అందించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications