గుండెపోటుతో వ్యవసాయశాఖ మంత్రి పాండురంగ మృతి: త్వరలో 4స్థానాలకు ఉపఎన్నిక
ముంబై: మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పాండురంగ పుండలిక్ ఫండ్కర్ బుధవారం అర్ధరాత్రి తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
పాండురంగ పుండలిక్ ఫండ్కర్ అలియాస్ భౌసాహేబ్ ఫండ్కర్ గతంలో శాసనమండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గం నుంచి 9, 10, 11 లోకసభలకు ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పాండురంగ పనిచేశారు. ఆయన 1950లో బుల్ధానాలో జన్మించారు.

1980, 1978లలో ఖాంగావ్ నుంచి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు పాండురంగ పుండలిక్ ఫండ్కర్. జులై 8, 2016లో ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం ఆయన అకోల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పాండురంగ మృతితో ఆ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. అదేవిధంగా కర్ణాటకలో మూడు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరగనున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications