Maharashtra Crisis:సుప్రీంకోర్టులో షిండే వర్గానికి షాక్..ఆ నిర్ణయం పై కీలక వ్యాఖ్యలు..!

Maharashtra Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. షిండే వర్గానికి షాక్ ఇచ్చింది. షిండే వర్గానికి సంబంధించిన వ్యక్తి భరత్ గోగవాలేను విప్‌గా నియమిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. అంతేకాదు కేవలం ఒక లేఖ ఆధారం చేసుకుని ఉద్ధవ్ థాక్రేకు మద్దతు లేదని చెప్పడం సరికాదని అభిప్రాయపడింది.

ఈ క్రమంలోనే గవర్నర్ తీసుకున్న నిర్ణయం కూడా సహేతుకంగా లేదని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఫడ్నవీస్‌తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉద్దవ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండాల్సిందని చెప్పిన సుప్రీంకోర్టు... వారు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించింది.

eaknadhshinde

ఇదిలా ఉంటే బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్ధవ్ థాక్రే విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేయడాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది.అదే సమయంలో ఒక లేఖ ద్వారా గవర్నర్ ఫ్లోర్ టెస్టుకు అనుమతించడం తప్పని చెబుతూనే పై ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ థాక్రే రాజీనామా చేయకుండా ఉండి ఉంటే తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చి ఉండేవారమని ధర్మాసనం పేర్కొంది.

ఫిబ్రవరి 21వ తేదీనుంచి రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారణ చేస్తోంది.ఉద్ధవ్ తరపున సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబాల్, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ, దేవదత్ కామత్‌లు వాదించారు. ఇక షిండే తరపున సీనియర్ అడ్వకేట్లు నీరజ్ కిషన్ కౌల్, హరీష్ సాల్వే, మహేష్ జెఠ్మలానీ, మనిందర్ సింగ్‌లు వాదించారు. మహారాష్ట్ర గవర్నర్ తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

కేసులో ఉన్న పలు పిటిషన్లను ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసింది. ఇందులో చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్, జస్టిస్ ఎంఆర్ షీ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహాలు ఉన్నారు. అయితే అనర్హత ఎదుర్కొంటున్న ఒక స్పీకర్ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉందా లేదా అనేది స్పష్టం చేయాలని కోరుతూ విస్తృత స్థాయి ధర్మాసనానికి బదిలీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+