వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా సంక్షోభం: ఉద్దవ్ సీఎం కాలేదని.. బ్లేడ్‌తో కోసుకొని.. ప్రాణాలకు తెగింపు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలతో మనస్తాపం చెందిన శివసేన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదనే బాధతో శివసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషిం జిల్లాలో చోటుచేసుకొన్నది.

పోలీసులు తెలిపిన ప్రకారం.. వాషింలోని ఉమారీ గ్రామానికి చెందిన రమేష్ బాబు జాదవ్ అనే శివసేన కార్యకర్త మనస్తాపానికి గురయ్యాడు. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేశాడని, ఇక ఉద్దవ్ థాకరేకు ముఖ్యమంత్రి దక్కదేమోనని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొన్నాడు. వ్యక్తిగత పని మీద మోనారా చౌక్‌‌కు వచ్చిన ఆయన శనివారం దారుణానికి పాల్పడ్డాడు అని పేర్కొన్నారు.

Maharashtra Government formation: Shiv Sena cadre attempt suicide

శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారనే వార్తలతో దిగ్బ్రాంతికి గురైన జాదవ్ తన చేతిని బ్లేడ్‌తో కోసుకొన్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశాడు. అనంతరం అతడిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతున్నది అని దిగ్రాస్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
మద్యం మత్తులో జాదవ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ ఆహ్వానించడం వివాదాస్పదమైంది. గవర్నర్ నిర్ణయంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సోమవారం ఉదయం 10.30 లకు విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.

English summary
Maharashtra Government formation: Shiv Sena supporter tried to commit suicide in Maharashtra's Washim district. police said, He upset over party chief Uddhav Thackeray not becoming the chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X